శివనామస్మరణతో మారుమోగుతున్న శివక్షేత్రాలు. ఈరోజు కార్తీక కార్తీక పౌర్ణమి కావడంతో శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి ఆలయంలో స్వామివారికి తెల్లవారుజాము నుండి ప్రత్యేక విశిష్ట అభిషేకాలు, పూజలు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గునుపూడి లోని ఒకటైన శ్రీ ఉమా సోమేశ్వర జనార్ధన స్వామి ఆలయం విశిష్టమైన క్షేత్రం. ఇక్కడ చంద్రుడే స్వయంగా స్వామివారి లింగాన్ని ప్రతిష్ఠించాడని ఇక్కడ స్వామివారు లింగం రంగులు మారుతుంది. సోమేశ్వర స్వామి లింగం పౌర్ణానికి శ్వేత వర్ణం తెలుగులోనూ అమావాస్య ముదురు గోధుమ రంగు లోనికి మారుతుంది. చంద్రుడు ప్రతిష్టించిన స్వామిని దర్శించుకుంటే కోరుకున్న కోరికలు తీరుతాయని భక్తుల గాఢ విశ్వాసం దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ స్వామివారి పక్కన పార్వతి దేవి స్వామివారి శిరస్సుపై భాగంలో అన్నపూర్ణమ్మ అమ్మవారు కొలువై ఉండటం ఈ ఆలయ విశిష్టత. ఈ కార్తీక మాసంలో పంచారామ యాత్రలో భాగంగా స్వామి వారిని భారీగా రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు దర్శించుకుంటారు. కార్తీక మాసం భక్తులకు నిత్య అన్నదానం పథకానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విప్ భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పర్యవేక్షణలో ఆలయ అధికారులకు మరియు పోలీస్ సిబ్బంది సహకారంతో స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు దేవస్థానం కార్యవర్గ సభ్యులు.
శివనామస్మరణతో మారుమోగుతున్న శైవక్షేత్రాలు
55
previous post