వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ షర్మిల

YS Sharmila

Advertisements

&NewLine;<p>ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ ప్రాజెక్టును ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల&comma; ఆ పార్టీ సీనియర్ నేతలు రఘువీరారెడ్డి&comma; పల్లంరాజు&comma; గిడుగు రుద్రరాజు తదితర నేతలు సందర్శించారు&period; షర్మిల వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు&period; 750 కోట్లు పెట్టి వైఎస్సార్ గుండ్లకమ్మ ప్రాజెక్టు కడితే ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ కోసం వైసీపీ ప్రభుత్వం ఏడాదికి కనీసం కోటి రూపాయలు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు&period; లక్ష ఎకరాలకు సాగునీరు&comma; 12 మండలాలకు తాగునీరు ఇచ్చే ప్రాజెక్ట్ గుండ్లకమ్మ అని షర్మిల తెలిపారు&period; 16 నెలల క్రితం ఒక గేటు&comma; మూడు నెలల క్రితం మరో గేటు కొట్టుకుపోయాయని అన్నారు&period; మెయింటెనెన్స్ లేకపోవడం వల్లే గేట్లు కొట్టుకుపోతున్నాయన్నారు&period; ఐదు సంవత్సరాల నుంచి సరిగా మెయింటెనెన్స్ చేసి ఉంటే గేట్లు కొట్టుకుపోయేవి కాదని చెప్పారు&period; జలయజ్ఞంలో భాగంగా గుండ్లకమ్మ ప్రాజెక్టును వైఎస్సార్ నిర్మించారని ఆ ప్రాజెక్టుకు కనీసం మెయింటెనెన్స్ కూడా చేయని జగన్ వైఎస్ వారసుడు ఎలా అవుతారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు&period; గేట్లు కొట్టుకుపోవడం వల్ల రెండు టీఎంసీల నీరు వృథాగా సముద్రంలోకి వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు&period; ప్రాజెక్టు ఖాళీ కావడంతో నీళ్లు లేక ఆయకట్టు రైతులు&comma; ప్రజలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు&period; రాజశేఖరరెడ్డి ఆశయాలను నిలబెడుతున్నానని జగనన్న అంటున్నారని ఇదేనా ఆశయాలను నిలబెట్టడం&quest; అని విమర్శించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..