బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా షేక్ హసీనా మరోసారి ఎన్నికయ్యారు. రికార్డు స్థాయిలో ఐదవసారి, వరుసగా నాలుగవసారి ఆమె ప్రధానిగా ఎన్నికయ్యారని బంగ్లాదేశ్ ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల్లో షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీకి 50 శాతానికిపైగా ఓట్లు వచ్చాయని ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది. ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఎన్నికలను బహిష్కరించడంతో అవామీ లీగ్ పార్టీ గెలుపు సునాయాసంగా గెలిచింది. గోపాల్‌గంజ్-3 నియోజకవర్గం నుంచి ప్రధాని షేక్ హసీనా ఎనిమిదవసారి విజయం సాధించారు. 1986 నుంచి ఆమె ఇక్కడ వరుస విజయాలు సాధిస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో హసీనాకు 2లక్షల 49 వేల 965 ఓట్లు పడగా తన సమీప అభ్యర్థి, బంగ్లాదేశ్ సుప్రీం పార్టీకి చెందిన నిజాం ఉద్దీన్ లష్కర్‌కి కేవలం 469 ఓట్లు మాత్రమే వచ్చాయి.
ప్రధాన మంత్రి గా మరోసారి ఎన్నికైన షేక్ హసీనా
56
previous post