నంద్యాల జిల్లా శ్రీశైల మహక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సంబరాలు అంభరాన్నంటాయి. శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామి అమ్మవారు బ్రహ్మోత్సవాలు ఆరోవరోజు పుష్పపల్లకిలో భక్తులకు దర్శనమిచ్చారు. పుష్పపల్లకిలో శ్రీస్వామి అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించి హారతులిచ్చారు. విద్యుత్ దీపకాంతుల నడుమ శ్రీశైల పురవీధులలో శ్రీ స్వామి అమ్మవార్లు గ్రామోత్సవానికి తరలుతుండగా ఉత్సవం ముందు కోలాటాలు డమరక నాధాలు పలు రకాల విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఆలయం ముందు పలు రకాల పుష్పాలతో దేదీప్యమానంగా సర్వాంగ సుందరంగా తయారుచేసిన పుష్పపల్లకిలో శ్రీస్వామి అమ్మవార్లు గ్రామోత్సవంలో భక్తులను కనువిందు చేశారు. గంగాధర మండపం వద్ద పుష్పపల్లకిలో ఉన్న శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక హారతులిచ్చి అనంతరం అంకాలమ్మ గుడి, నంది మండపం బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు శ్రీస్వామి అమ్మవార్ల గ్రామోత్సవం కన్నులపండువగా సాగింది. గ్రామోత్సవాన్ని తిలకించేందుకు వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. పుష్ప పల్లకిపై ఉన్న శ్రీ స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకుని కర్పూర నీరాజనాలర్పించారు. శ్రీశైల క్షేత్రమంత శివనామస్మరణతో మారు మ్రోగింది. పుష్ప పల్లకి సేవలో ఆలయ చైర్మన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డి, ఈవో పెద్దిరాజు దంపతులు, ఆలయ ట్రస్టు బోర్డ్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
పుష్ప పల్లకిపై దర్శనమిచ్చిన శ్రీ స్వామి అమ్మవార్లు…
98