మైనార్టీల ఆత్మీయ సదస్సు…

Spiritual Conference Program of Minorities

Advertisements

&NewLine;<p>ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మైనార్టీల ద్రోహి అని మాజీ శాసనమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ విమర్శించారు&period; అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని అజిజియా షాది మహల్ లో మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించిన మైనార్టీల ఆత్మీయ సదస్సు కార్యక్రమానికి మాజీ శాసనమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు&period; ముందుగా రాయదుర్గం పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు&period; అనంతరం పట్టణంలోని షాదీ మహల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు&period; ఈ సందర్భంగా పట్టణంలోని అజీజీయ షాది మహల్ లో నిర్వహించిన సమావేశానికి మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు అధ్యక్షత వహించారు&period; సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ శాసనమండలి చైర్మన్ ఎం&period;ఎ షరీఫ్ మాట్లాడారు&period; వైసీపీ పాలనలో ముస్లిం మైనారిటీల మాన&comma; ప్రాణాలకు రక్షణ కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు&period; రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ వైసిపికి తొత్తుగా మారిందని మండిపడ్డారు&period; రాష్ట్రంలో వైసీపీ నాయకుల వేధింపుల కారణంగా కొన్ని మైనారిటీ కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు&period; బేల్ రద్దు కాకుండా ఉండడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బిజెపి తొత్తుగా మారాడని మండిపడ్డారు&period; పార్లమెంటులో మైనారిటీల వ్యతిరేక బిల్లులు ఆమోదం పొందేందుకు వైసిపి ఎంపీలు ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు పలికి మైనారిటీలకు తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు&period; ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బంధం తండ్రి కొడుకుల బంధం అని కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ పేర్కొనడంలోనే వైసిపికి కేంద్రం సహకరిస్తుందని స్పష్టంగా అర్థమవుతుందని పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.