నంద్యాల జిల్లా.. ఆళ్లగడ్డ మండలం లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి (Sri Lakshmi narasimha swamy) వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు ఎగువ అహోబిలం క్షేత్రంలో శరభ వాహనంపై కొలువు తీరి భక్తులకు దర్శనమిచ్చారు. ఎగువ అహోబిలంలో శ్రీ జ్వాల నరసింహస్వామి, శ్రీ చెంచులక్ష్మి అమ్మవార్లకు ఉదయం అభిషేకం, మోహిని అలంకారం కార్యక్రమాన్ని వేద పండితులు నిర్వహించారు. ఇదిలా ఉండగా దిగువ అహోబిలం క్షేత్రంలో జరుగుతున్న శ్రీ వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారిని శేష వాహనంపై స్వర్ణాభరణాలతో అలంకరించి ఆలయ మాడవీధులలో ఊరేగింపు నిర్వహించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
అనంతరం రాత్రి చంద్రప్రభ వాహనంపై శ్రీ ప్రహ్లాద వరద స్వామి , శ్రీదేవి భూదేవి అమ్మవార్లను అలంకరించి ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు ప్రతినిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు అహోబిలానికి తరలివస్తున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అహోబిలంలో తిరుణాళ్ళ సందడి నెలకొంది. రాత్రి దిగువ అహోబిలంలో చంద్రప్రభ వాహనంలో కొలువైన శ్రీ భూ దేవేరులతో శ్రీ ప్రహ్లాద వరద స్వామి మాడవీధిలో విహరించారు. ఈ కార్యక్రమంలో అహోబిలం 46వ పీఠాధిపతి పాల్గొన్నారు.
ఇది చదవండి: శ్రీకాళహస్తి టిడిపి అభ్యర్థి ప్రకటన తర్వాత శ్రీకాళహస్తిలో గందరగోళం…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి