శ్రీ శివలింగేశ్వర స్వామి దేవాలయం 26 వ వేడుకలు…

Mrityunjaya Homam

Advertisements

&NewLine;<p>శ్రీ దేవి నల్లపోచమ్మ శ్రీ శివలింగేశ్వర స్వామి దేవాలయం 26 వ వేడుకలను ఘనంగా నిర్వహించారు&period; ఈ వేడుకలు మూడు రోజులపాటు నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు అశోక్&comma; యాదవ రావులు తెలిపారు&period; రెండో రోజు శ్రీ లక్ష్మీనరసింహ సహిత మృత్యుంజయ హోమం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి&comma; హోమంలో పాల్గొన్నారు&period; ప్రత్యేక పూజలు చేసిన బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ కు ఆలయ ప్రధాన అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి&comma; ఆలయ కమిటీ సభ్యులు శాలువతో జంపన ప్రతాప్ ను సన్మానం చేశారు&period; మొదటిరోజు మహాగణపతి సహిత నవగ్రహ హోమం నిర్వహించడం జరిగిందని&comma; మూడవరోజు ఆదివారం ఉదయం 8 గంటలకు మహా చండీ హోమం&comma; వివిధ ప్రత్యేక పూజలు ఉంటాయని&comma; తదనంతరం అన్నప్రసాద కార్యక్రమాలు ఉంటాయని&comma; ఆలయ కమిటీ సభ్యులు అశోక్&comma; యాదవరావులు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు..

ప్రణీత్‌ ప్రణవ్‌ గ్రూప్‌పార్క్‌పై పోరాటానికి సిద్ధమవుతున్న స్థానికులు..