భవిష్యత్ తరాలకు గుర్తుండే విధంగా రాయచోటి అభివృద్ధి జరుగుతోందని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని వందపడకల ఆసుపత్రి, ఆర్ టి సి బడ్ స్టాండ్ విస్తరణ భవనాల పనులను మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష, జిల్లా వైసిపి విభాగం మైనార్టీ జిల్లా అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్ తో కలిసి పరిశీలించారు. ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద ఆర్చి నిర్మాణ పనులను, అదేవిధంగా రహదారి నిర్మాణాల పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. నాడు – నేడు క్రింద ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలల అభివృద్ధి ఎంతో జరిగిందన్నారు. పట్టణంలో 4 అర్బన్ హెల్త్ క్లినిక్ లను అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాలను కూడా ఇక్కడే ఏర్పాటు చేసి మహిళా ప్రాంగణంగా తీర్చిదిద్దుతున్నామని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అదేవిధంగా
పట్టణ పేదల కోసం నారాయణరెడ్డి పల్లె జగనన్న కాలనీలో 6 వేల ఇళ్ల నిర్మాణాలు, ఎం ఐ జి లేఔట్ లను త్వరగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
Read Also..
Read Also..