శ్రీశైలం (Srisailam) :
నంద్యాల జిల్లా శ్రీశైలం (Srisailam) క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం తరుపున భక్తులకు వసతీ గదులను నిర్మించేందుకు శ్రీశైలం దేవస్థానం అభివృద్ధికి సహకరించేందుకు సిద్దంగా ఉన్నామని తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఓ ధర్మారెడ్డి అన్నారు. శ్రీశైలంలో వైభవంగా జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం తరుపున శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించామని, దేశం సస్యశ్యామలంగా ఉండాలని శ్రీశైలం శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామి వారికి కోరుకున్నామని టిటిడి ఈ ఓ ధర్మారెడ్డి అన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ముందుగా ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న టిటిడి ఈ ఓ ధర్మారెడ్డికి చైర్మన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డి, ఆలయ ఈ వో పెద్దిరాజు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు వేద పండితులు శాస్త్రోక్తంగా పట్టు వస్త్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు. అనంతరం టిటిడి చైర్మన్ పట్టు వస్త్రాలను తలపై పెట్టుకొని స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. అమ్మవారి ఆశీర్వచన మండపంలో ఈ ఓ ధర్మారెడ్డికి శ్రీశైలం ఆలయ చైర్మన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డి, ఈ వో పెద్ది రాజు స్వామి అమ్మవార్ల జ్ఞాపికను అందజేయగా అర్చకులు వేద పండితులు తీర్ధ ప్రసాదాలిచ్చి ఆశీర్వదించారు. శ్రీశైలం దేవస్థానంలో భక్తుల కోసం రెండు వందల రూములు నిర్మాణం చేసేందుకు సిద్దంగా ఉన్నామని శ్రీశైలం దేవస్థానం తరుపున లెటర్ పంపిస్తే బోర్డు మీటింగ్ లో పెట్టి తీర్మానం చేస్తామని ఈ ఓ ధర్మారెడ్డి అన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది చదవండి : రేపటి నుంచి శ్రీకాళహస్తి దేవస్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి