Latest video News: Cvr News provides the latest news video headlines, latest videos clip from India and the World. Get all breaking news videos on Entertainment, Business, Elections, Politics and more.
HomeNationalలాభాలతో దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు
నిన్న నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు దూసుకుపోతున్నాయి. ఈ ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 770 పాయింట్ల లాభంతో 72, 415 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 238 పాయింట్లు పెరిగి 21,935 వద్ద కొనసాగుతోంది. అన్ని సూచీలు లాభాల్లోనే ఉన్నాయి. ఇన్ఫ్రా, ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ, రియాల్టీ సూచీలు 2 శాతానికి పైగా లాభాల్లో కొనసాగుతున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ లో మారుతి, టైటాన్, హిందుస్థాన్ యూనిలీవర్ మినహా అన్ని స్టాకులు లాభాల్లో ఉన్నాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఇన్ఫోసిస్ షేర్లు 2 శాతానికి పైగా, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్, టాటా స్టీల్ కంపెనీల షేర్లు ఒకటిన్నర శాతానికి పైగా లాభాలను నమోదు చేశాయి. అమెరికా మార్కెట్లు లాభాలతో ముగియడం, ఆసియా పసిఫిక్ ప్రధాన మార్కెట్లు సానుకూలంగా ట్రేడ్ అవుతుండటం మన ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచింది. దీంతో, మదుపరులు కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు.