60
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో సాగుతున్నాయి. ప్రారంభం నుంచి సూచీలన్నీ పతనమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్ ఛేంజ్ -బీఎస్ఈ సెన్సెక్స్ అయితే ఏకంగా 600 పాయింట్లకుపైగా నష్టంలో ఉంది. నేషనల్ స్టాక్ ఎక్స్ ఛేంజ్ -నిఫ్టీ 170 పాయింట్లకుపైగా కోల్పోయింది. బ్యాంక్ నిఫ్టీ 720 పాయింట్లకుపైగా కోల్పోయింది. ఇక నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలన్నీ నష్టాల్లోనే సాగుతున్నాయి. ఇప్పటికే లక్ష కోట్ల రూపాయలకుపైగా మదుపరుల సంపద హారతి కర్పూరమై ఉంటుందని అంచనాలు వెలువడుతున్నాయి. నష్టాల భయంతో అమ్మకాలు పెరిగాయి.