మందమర్రి పట్టణంలోని వివేకానంద కాలేజ్ ఆఫ్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సిద్దయ్య ఇంటి ఆవరణలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ…., వివేకానంద కాలేజ్ ఆఫ్ పాలిటెక్నిక్ కళాశాల మూడు నెలలుగా టీచర్ లు బోధించడం లేదని పాలిటెక్నిక్ కళాశాల ఆర్థికంగా నష్టపోయి మూసివేస్తున్నట్టు యాజమాన్యం తెలపడంతో ఫీజులు చెల్లించి పరీక్షలు రాయలేని పరిస్థితిలో ఉన్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్, విద్యాధికారులను కలుసుకొని సమస్యను ఫిర్యాదు చేసిన అధికారులు స్పందించడం లేదని తెలిపారు. పాలిటెక్నిక్ కళాశాల యాజమాన్యంతో మాట్లాడడానికి తల్లిదండ్రులతో సంప్రదించడానికి ప్రయత్నిస్తే కలవడం లేదని, కనీసం ఫోన్ కాల్ కూడా లిఫ్ట్ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధ్యాపకులను మిగిలిన సిలబస్ పూర్తి చేయాలని కోరితే, మూడు నెలలుగా మాకు జీతాలు రావడంలేదని మా జీతాలు చెల్లిస్తేనే కదా విద్యార్థులకు మీకు పాఠాలు బోధిస్తామని హెచ్చరిస్తున్నారని బాధపడ్డారు. ఏప్రిల్ లో సెమిస్టర్ ఎగ్జామ్స్ కు సిద్ధమైనప్పటికీ కళాశాల మూసివేతతో దిక్కుతోచని పరిస్థితుల్లో విద్యార్థినీ విద్యార్థులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఫీజులు చెల్లించి పరీక్షలు రాయలేని స్థితిలో విద్యార్థులు…
91
previous post