64
జయశంకర్ విశ్వవిద్యాలయానికి చెందిన వంద ఎకరాల భూమిని కోర్ట్ భవనాలకు మంజూరు చేయడాన్ని నిరసిస్తూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట జయశంకర్ వ్యవసాయ కళాశాల విద్యార్థులు నిరసన ర్యాలీ చేపట్టారు. కళ్ళకు గంతలు కట్టుకొని, నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించారు. అనంతరం కళాశాల ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. ఆ భూముల్లో బయోడైవర్సిటీ పార్కు ఉందని, అత్యంత అమూల్యమైన ఆ వృక్ష సంపద జీవ వైవిధ్యానికి సంబంధించి ఎన్నో పరిశోధనలకు ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జీవో రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు.