సుబ్రహ్మణ్యేశ్వ స్వామి షష్ఠి మహోత్సవాలను సోమవారం కొత్తపేట నియోజకవర్గం లో వాడ వాడలా ఘనంగా నిర్వహించారు.భక్తులు వేకువ జామున నుంచే ఆలయాలకు చేరుకొని స్వామిని దర్శించుకుని పూలు,పడగలు సమర్పించుకున్నారు.పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో ఆలయాలన్నీ కిటకిటలాడాయి.ముఖ్యంగా కొత్తపేట మండల పరిధిలోని వాడపాలెం లో వేంచేసియున్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారు జామున నుండే స్వామి వారికి ప్రధాన అర్చకులు శ్రీను,మణి,సాయి గార్ల చే ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.అత్యధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలి వచ్చి స్వామి వారిని దర్షించుకున్నారు.అలాగే కొత్తపేటలో పురాణ ప్రసిద్ది చెందిన హరి హర దేవాలయం ప్రాంగణంలో గల వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో భక్తులు అత్యధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు.ఆలయాల వద్ద రద్దీ ఎక్కువవడంతో భక్తుల క్యూ లైన్లుతో ఎక్కడికక్కడ బారులు తీరారు.నియోజకవర్గం లోని పలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.మండలం లో ఆయా ఆలయాల వద్ద షష్ఠి తీర్థాలు ఘనంగా నిర్వహించారు.
వైభవంగా సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలు..
102
previous post