తూర్పుగోదావరి జిల్లా అనపర్తి వీర్రాజు మావిడి వద్ద వెలసిన శ్రీకుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి వేడుకల్లో భాగంగా తమిళనాడు రాష్ట్రంలోని పలనిమలై లో నిర్వహించే వేల్ కావిడిఉత్సవం గత పది సంవత్సరాలుగా అనపర్తి గ్రామంలో వీర్రాజు మామిడి కమిటీ సభ్యులు నిర్వహిస్తున్నారు. 226మంది సుబ్రమణ్య స్వాములు మాలలు ధరించి భక్తులు గ్రామ ప్రజలు గ్రామ పురవీధుల్లో నృత్యాలు చేస్తూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంపై స్వామివారిని ఊరేగించారు. స్వామివారిని దర్శించేందుకు భక్తులు గ్రామస్తులు అడుగడుగున హారతులు పడుతూ స్వామివారికి తమ మొక్కులను చెల్లించుకున్నారు. అదేవిధంగా సోమవారం జరిగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా తగు చర్యలు కమిటీ నుండి చేపట్టామని భక్తులందరూ స్వామివారి దర్శనార్థం వీర్రాజు మావిడికి విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి వలసిందిగా ఆలయ కమిటీ భక్తులను కోరింది.
Read Also..