వైసీపీ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా చాలమ్మలశెట్టి సునీల్ పేరు ఖరారు అయింది.. వైసీపీ అయిదవ జాబితాలో ఆయన పేరు ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేశారు. ఈయన కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయడం నాలుగో సారి. 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి మళ్లీ ఓటమిని ఎదుర్కొన్నారు. 2019లో టీడీపీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుని ఓటమి బాట పట్టారు. అప్పటినుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆరు నెలల క్రితం వైసీపీలో చేరారు. జగ్గంపేట అసెంబ్లీ టికెట్ అడిగారు. కానీ పార్టీ అధిష్టానం ఆయనకు కాకినాడ ఎంపీ టికెట్ కేటాయించింది. కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను పిఠాపురం అసెంబ్లీ ఇన్చార్జిగా నియమించడంతో ఎంపీగా సునీల్ పేరు ఖరారు చేసారు. వరుసుగా మూడుసార్లు ఓడిపోయిన సానుభూతి నేపథ్యంలో నాలుగవసారి గెలుస్తారు అన్న చర్చ జరుగుతోంది. విదేశాలలో పెద్ద ఎత్తున వ్యాపార వాణిజ్య కేంద్రాలు నిర్వహించే సునీల్ రాజకీయ అరంగేట్రంతోనే ఓటమి చవి చూసారు. ఈ నేపథ్యంలో ఈసారి ఆయన గెలుపు బాట పడతారా అనే చర్చ జరుగుతోంది.
కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా సునీల్..
72
previous post