68
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు పలికింది. తెలంగాణలో బీజేపీ గెలుపు కోసం కృషి చేయాలని మాదిగ సామాజిక వర్గానికి, ఎస్సీలలోని ఇతర వర్గాలకు మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలపలేదని మండిపడ్డారు. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిగలకు వెన్నుపోటు పొడిచారన్నారు. మంత్రివర్గంలో కూడా ఎస్సీలకు అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్న బీజేపీని గెలిపించాలని అభ్యర్ధించారు. ఇటీవల జరిగిన మాదిగ విశ్వరూప సభకు ముఖ్యఅతిధిగా హాజరైన ప్రదాని మోదీ ఎస్సీ వర్గీకరణకు కమిటి ఏర్పాటు చేస్తామని హామి ఇచ్చారు.