105
ఏపి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ట్యాబ్ లు పంపిణీ చేస్తున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు జెడ్పీ గర్ల్స్ హైస్కూల్ లో 8వ తరగతి విద్యార్థులకు ఎమ్మెల్యే వెంకట్ గౌడ్ ట్యాబ్ లను పంపిణీ చేశారు. మండలంలో 875 ట్యాబ్స్ పంపిణీ చేశామని, గతంలో 64 జీబీ ఉన్న కెపాసిటీని ఇప్పుడు 250కి పెంచడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. ట్యాబ్ లో వేరే యాప్స్ ను ఇన్ స్టాల్ చేసుకోలేరని ఎందుకంటే వేరే యాప్స్ ఉంటే పిల్లలకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో ఈవిధంగా చేశామని ఎంఈవో లీలారాణి తెలిపారు.