పట్టణంలోని యాదవ్ బజార్ లో రూ.60 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా స్ట్రోమ్ వాటర్ డ్రైనేజ్ – జగనన్న వాక్ వే ను నిర్మించారు. పాత బస్టాండ్ సమీపంలో రూ.22 లక్షల అంచనా వ్యయంతో ఆధునికరించిన బాబు జగ్జీవన్ రామ్ భవన్ ను మంత్రి జోగి రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తానని అన్నారు. నేను వైసిపి పెనమలూరు అభ్యర్థిని నా మీద ఎవరు పోటీ చేసినా నేను సిద్ధమేనని, పెడన నియోజకవర్గ ఉప్పాల రాముకు నేను పూర్తిగా సహకరిస్తానని అన్నారు. కేశినేని నాని మా పార్టీలోకి వస్తాను అనడంతో అతన్ని పార్టీలోకి ఆహ్వానించామని, విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించామని ఆయన అక్కడ గెలవబోతున్నారని అన్నారు. నా నియోజకవర్గం మైలవరం 2009లో రాజశేఖర్ రెడ్డి గారు పెడనలో పోటీ చేయమన్నారు అప్పుడు అక్కడ పోటీ చేశాను. 2014లో జగన్మోహన్ రెడ్డి మైలవరం నియోజకవర్గంలో పోటీ చేయమన్నారు అప్పుడు అక్కడ పోటీ చేశాను. 2019లో మరల పెడన నియోజకవర్గంలో పోటీ చేయమన్నారు మళ్ళి అక్కడ పోటీ చేశాను. ఇప్పుడు పెనమలూరులో పోటీ చేయమంటున్నారు అలానే ఇప్పుడు అక్కడ పోటీ చేస్తాను. జగన్ ఎలా చెప్తే అలా నేను పని చేస్తానని, ఆయన మాటను నేను శిరసా వహిస్తానని ఆయన అన్నారు.
జగన్
గత 20 రోజులుగా తమకు న్యాయం చెయ్యాలని ఏపీలో అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు. జగన్ కు, వారి ఎమ్మెల్యేలకు ఆడవారి ఉసురు తగులుతుందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ అన్నారు. అన్ని వర్గాలకు చెందిన కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎస్మా చట్టాన్ని వెంటనే రద్దు చెయ్యాలంటూ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికులను ఇబ్బంది పెడితే జనసేన పార్టీ వారికి అండగా నిలుస్తుందన్నారు. అంగన్వాడీల సమస్యలకు పరిష్కారం చూపకుండా ఎమ్మెల్యేలు, ఎంపీల బదిలీల కార్యక్రమంలో నిమగ్నమయ్యారంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను భయపెట్టి జగన్ పాలన సాగిస్తున్నారని మాజీ మంత్రి ఆలపాటి రాజా ఆరోపించారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం అంగలకుదురు గ్రామం నుంచి తన రెండో రోజు పాదయాత్ర ప్రారంభించారు. ఓట్ల కోసం నా ఎస్సీ, నా ఎస్టీ, నాబీసీ, నా మైనార్టీ అంటూ ప్రేమ కురిపించి.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వర్గాలన్నింటినీ జగన్ మోసం చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలోని 33 వేల మందిపై దాడులు జరిగాయని ఆరోపించారు. జగన్ పాలనతో విసిగిపోయిన ప్రజలు ఆయన ను ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
2019 ముందు జగన్ మోహన్ రెడ్డి అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసాడని బోండా ఉమా అన్నారు. లక్ష పది వేల మంది అంగన్వాడీ ఉద్యోగులు రోడ్డున పడ్డారని ఆయన అన్నారు. జగన్ ఇచ్చిన హామీలు నిరవేర్చకుండా వాళ్ళ మీద ఎస్మా ప్రయోగం అమలు చేస్తున్నాడని అన్నారు. అలాగే ఈ రోజు మున్సిపల్ కార్మికులు నిరసన వల్ల విజయవాడ అంతా కంపు కొడుతా ఉందని అన్నారు. ఈ రోజు ఈ చిరు ఉద్యోగుల మీద నువ్వు ఎందుకు ఇంత కూరాత్మకంగా వ్యవహరిస్తున్నావని ఆయన జగన్ ను ప్రశ్నించారు. అంగన్వాడీ ఉద్యో్గులు ఉద్యోగాలకి వెళ్లకపోవడం వల్ల గర్భిణీలు ఎంతో ఇబ్బంది పడుతున్నారని అన్నారు. మున్సిపల్ కార్మికులు ఉద్యోగాలకు వెళ్ళాక పోవడం వలన సుమారు రోజుకు 600 టన్నుల చెత్త రోడ్డు ల పడి ఉన్నాడని అన్నారు. ఈ చలికాలం లో చెత్త పేరుకు పోవటం వలన దోమల బెడద ఎక్కువై ప్రజలు అనారోగ్యానికి గురై ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. హాస్పిటల్స్ లో ప్రజలు జాయిన్ అవుతుంటుంటే ఆరోగ్య శ్రీ పనిచేయడం లేదని అన్నారు. తెలుగుదేశం పార్టీ అంగన్వాడీ ఉద్యోగులకు, మున్సిపల్ కార్మికుల సమ్మెకు పూర్తి మద్దతు తెలియజేస్తుందని అన్నారు. అన్ని నిత్యా అవసర సరుకుల ధరలు పెంచావు ఈ ప్రభుత్వం లో ప్రజలు ఎంతో నరకం అనుభవించారని అన్నారు. ఈ ప్రభుత్వం తో ప్రజలు విసిగి పోయారు ఇంకా మూడు నెలల సమయం మాత్రమే ఉందని గుర్తు చేసారు. ఆ రోజు నువ్వు అధికారంలోకి రావడం కోసమే జనాలకు అమలు కానీ హామీలు ఇచ్చావని ఆయన అన్నారు.
మచిలీపట్నం పార్లమెంట్ కార్యాలయంలో జెండా ఊపి జయహో బీసీ రథాలను మాజీమంత్రి కొల్లు రవీంద్ర, మాజీ పార్లమెంటు సభ్యులు కొనకళ్ళ నారాయణరావు, జనసేన ఇంచార్జ్ బండి రామకృష్ణ, తెదేపా బిసి నాయకులు ముందుకు పంపించారు. అనంతరం మాజీ మాత్రి కొల్లు రవీంద్ర మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజలను మరోసారి చైతన్య వంతులుగా చేసేందుకే జయహో బీసీ కార్యక్రమమని ఆయన అన్నారు. జయహో బీసీ కార్యక్రమం ద్వారా రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీలకు చేయబోయే కార్యక్రమాలను వివరించడంతో ప్రజలు వారికి అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారని అన్నారు. జగన్ ని తరిమికొట్టడం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యమని, జగన్ ఓటమికి సిద్ధమయ్యాడని అన్నారు. జగన్ చెస్ గేమ్ ఆడుతున్న అనుకుంటున్నాడు కానీ తను ఆడుతుంది వైకుంఠపాళీ అని అతనికి తెలియడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఐదేళ్ల ప్రభుత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను పావులుగా వాడుకున్నాడని, బీసీలు పక్కన పెట్టాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగస్తులను మారుస్తున్నట్టు MLA లను పక్క నియోజకవర్గాలకు జగన్ బదిలీ చేస్తున్నాడని అన్నారు. MLA క్యాండెట్స్ మార్చడం కాదు ముందు జగన్ ని మార్చాలని, సూపర్ సిక్స్ ద్వారా ప్రజల్లోకి వెళుతున్నామని ఆయన అన్నారు. పంచాయతీ రాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని, టీడీపీ వచ్చాక మళ్ళి పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తామని అన్నారు. బీసీలకు జగన్ అన్ని రకాలుగా అన్యాయం చేశాడని, లక్షాధికారులను చేస్తానని చెప్పి 56 కార్పొరేషన్లు పెట్టి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు. బీసీలను దగా చేస్తున్నాడని, 300 మంది బీసీలను పొట్టన పెట్టుకున్నాడని ఆయన జగన్ పై మండిపడ్డారు. ఈ నెల 7 వ తేదీన నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తిరువూరులో రా కదలిరా అనే నినాదంతో భారీ బహిరంగ సభ జరగనున్నది. 18వ తేదీన మచిలీపట్నం పార్లమెంట్, గుడివాడ నియోజకవర్గం లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బిసి ప్రధాన కార్యదర్శి వీరంకి గురుమూర్తి, చిత్తజిల్లు నాగ రాము, అక్కు మహాంతి రాజా, గోపు సత్యనారాయణ, లంకె నారాయణ ప్రసాద్ , పళ్లపాటి సుబ్రమణ్యం , వూకంటి రాంబాబు, లంకే శేషగిరి, తిరుమణి నారాయణ, కాగిత గోపాలరావు, తదితర బీసీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
అంగన్వాడి టీచర్లు, వర్కర్లు సమ్మె కొనసాగిస్తూ ఈరోజు కోరుకొండ ప్రాజెక్టు సంబంధించిన కోరుకొండ గోకవరం, సీతానగరం మండలాలకు చెందిన అంగన్వాడి టీచర్లు, వర్కర్లు వంటావార్పు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తమ యొక్క నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ మాట్లాడుతూ జగన్ గారు గతంలో పాదయాత్ర సందర్భంగా అంగన్వాడి టీచర్లకు, వర్కర్లకు సంబంధించిన మా యొక్క న్యాయమైన డిమాండ్లను కచ్చితంగా పరిష్కరిస్తానని మాట ఇచ్చారు. కానీ జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతోమందికి ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మా అంగన్వాడి టీచర్లు వర్కర్ల విషయానికి వచ్చేసరికి మమ్మల్ని ఎందుకు జగన్ గారు చిన్న సూపు చూస్తున్నారు. మా సమస్యలు పరిష్కరించడం జగన్ గారికి చాలా చిన్న విషయం అయినప్పటికీ జగన్ గారు మా యొక్క న్యాయమైన డిమాండ్లు పరిష్కరించడంలో చొరవ తీసుకుని మాకు న్యాయం చేస్తారని వేడుకుంటున్నాం అని అంగన్వాడి టీచర్లు తమ ఆవేదన వ్యక్తపరిచారు.
ఆంద్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు విశాఖలోని రుషికొండ చుట్టూ తిరుగుతున్నాయి. జగన్ ప్రభుత్వం విశాఖని పరిపాలనా రాజధానిగా ప్రకటించినప్పటినుంచి రుషికొండ వివాదాలకొండగా మారిపోయింది. ప్రభుత్వం రుషికొండ చుట్టూ అక్రమ తవ్వకాలు చేపడుతుందని విపక్షాలు హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై అప్పట్లో విచారణ చేపట్టిన న్యాయస్థానం పరిశీలన కోసంఓ కమిటీని నియమించింది. ఆ కమిటీ రుషికొండపై జరుగుతున్న నిర్మాణాలపై ఓ నివేదిక ఇచ్చింది. అనుమతికి మించి నిర్మాణాలు ఉన్నాయని ఆ కమిటీ పేర్కొంది. అయితే, సీఎం జగన్ తాను విశాఖకు మకాం మార్చుతున్నానంటూ, ప్రభుత్వ భవనాల నిర్మాణం కోసం ప్రత్యేక కమిటీ వేశారు. రుషికొండపై నూతనంగా చేపట్టిన నిర్మాణం బాగుందంటూ ఈ కమిటీ నివేదిక ఇచ్చేందుకు సన్నద్ధమైంది. దాంతో, రుషికొండ ఉల్లంఘనలపై మొదట్లో పిటిషన్లు వేసిన వారు హైకోర్టులో మరో పిటిషన్ వేశారు. తాజాగా, రుషికొండ నిర్మాణాలపై మరోసారి విచారణ చేపట్టిన హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. తాము నియమించిన కమిటీ ఇచ్చిన నివేదికపై మరోసారి విచారణ చేపట్టాలని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శిని ఆదేశించింది. రుషికొండపై ఉన్న నిర్మాణాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. అంతేకాదు, దీనిపై మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో తదుపరి విచారణను నవంబరు 28కి వాయిదా వేసింది. రుషికొండపై 9.88 ఎకరాలకు అనుమతి ఇస్తే, 20 ఎకరాల్లో తవ్వకాలు చేపట్టారని అప్పట్లో పిటిషన్లు వేశారు. విచారణ సందర్భంగా అనుమతికి మించి 3 ఎకరాలు ఎక్కువ తవ్వకాలు చేపట్టినట్టు ప్రభుత్వం అంగీకరించింది. అయితే, అంతకంటే ఎక్కువే తవ్వకాలు చేపట్టారని పిటిషనర్ ఆరోపించడంతో, కేంద్ర ప్రభుత్వం సర్వే చేపట్టింది. ఇప్పుడు హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో, రుషికొండలో కేంద్రం మరోసారి సర్వే చేపట్టే అవకాశాలున్నాయి.





Total views : 150182