భారత్‌లో తయారు చేసే టాటా కార్లు స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీతో వస్తాయి. దేశీయ వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్, వివిధ రంగాల్లో ప్రత్యేకతను చాటుకొంది. టాటా మోటార్స్ నుంచి ఇప్పటికే అనేక కార్లు మార్కెట్లోకి వచ్చి సక్సెస్ అయ్యాయి. కొత్త ఏడాది 2024లో సైతం కొన్ని మోడళ్లు లాంచ్ కానున్నాయి. కస్టమర్లు ఎంతగానో ఆసక్తి చూపుతున్న ఈ అప్‌కమింగ్ కార్లపై ఓ లుక్కేయండి. ఈ ఆల్-ఎలక్ట్రిక్ మిడ్‌సైజ్ ఈవీ 2024లో పండుగ సీజన్‌కు ముందు మార్కెట్లోకి రానుంది. నెక్సాన్ EV మాదిరిగానే, అదే డిజైన్‌లో రానుంది. డీజిల్-బేస్ట్ హారియర్ లాంటి బేస్ ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్, ఎక్విప్‌మెంట్స్‌తో వెహికల్‌ను టాటా మోటార్స్ రూపొందిస్తోంది. ఇది బ్లూ ఇన్సర్ట్స్, క్లోజ్డ్ గ్రిల్ వంటి ఈవీ-స్పెసిఫిక్ డిజైన్ ఎలిమెంట్స్‌తో వస్తుంది. 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, LED హెడ్‌ల్యాంప్స్, సన్‌రూఫ్, ఫుల్-TFT ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్‌లు, టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లతో పంచ్ ఈవీ బెస్ట్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ అందించనుంది. దీని ధర రూ.12లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉండవచ్చు. టాటా కర్వ్ అనేది కూపే డిజైన్‌తో వచ్చే ఒక కాంపాక్ట్ SUV. ఈ కారు ధర రూ.10.50 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 5-సీటర్ లేఅవుట్‌లో వెహికల్ రిలీజ్ కానుంది. ఇది నెక్సాన్, హారియర్ మధ్య లైనప్‌లో ఉంటుంది. కొత్త 1.2-లీటర్, 125 PS టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు 1.5-లీటర్ డీజిల్, ఆల్-ఎలక్ట్రిక్ డ్రైవ్‌ట్రైన్ ఆప్షన్లలో వెహికల్ లాంచ్ అవుతుంది. టాటా కర్వ్ ఈవీ , కొత్త నెక్సాన్ EV లాంటి స్పెసిఫికేషన్లతో వస్తుంది. పెద్ద 12.3- అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, టచ్-బేస్డ్ క్లైమేట్ కంట్రోల్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ వంటి ఫీచర్లు దీని సొంతం. ఈ వెహికల్ మల్టిపుల్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో ఏకంగా 500 కిమీ కంటే ఎక్కువ రైడింగ్ రేంజ్‌ను అందిస్తుంది. 2024 మార్చిలో మార్కెట్లోకి రానున్న ఈ వెహికల్ ధర సుమారు రూ.20 లక్షలు. నెక్సాన్ డార్క్ ఎడిషన్ 2024లోనే మార్కెట్లోకి రానుంది. బ్లాక్ అల్లాయ్ వీల్స్, డార్క్ బ్యాడ్జ్‌లు, ఆల్-బ్లాక్ ఇంటీరియర్, బేస్ వేరియంట్‌కు సమానమైన పవర్‌ట్రెయిన్ కాన్ఫిగరేషన్ వంటి ఎలిమెంట్స్‌తో వెహికల్ లాంచ్ కానుంది. టాటా మోటార్స్ 2024లో ఆల్ట్రోజ్ హ్యాచ్‌బ్యాక్‌కు పూర్తి మేక్ఓవర్ ఇవ్వబోతోంది. పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫుల్-TFT ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ వంటి కొత్త ఫీచర్లు, ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ మార్పులతో టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ ఎడిషన్ లాంచ్ కానుంది. కంపెనీ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో కొత్త మోడల్‌ను రూపొందించనుంది.
2024లో సరికొత్త టెక్నాలజీతో టాటా మోటార్స్ కార్లు
117
previous post