71
యువగళం సభ సక్సెస్ కావడంతో వైసీపీ నాయకులకు భయం పట్టుకుందని టీడీపీ నాయకులు ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోతుందనే భయం వైసీపీ నాయకుల్లో కలుగుతోందని సూళ్లూరుపేట టీడీపీ ఇంఛార్జ్ నెలవల సుబ్రమణ్యం తెలిపారు. టీడీపీ – జనసేన పార్టీ ఉమ్మడిగా రానున్న ఎన్నికల్లో అఖండ విజయం సాధించి అధికారం చేపట్టడం ఖాయమని జోస్యం చెప్పారు. యువగళం ముగింపు సభకు వచ్చిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు. అవినీతి అరాచక వైసీపీ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. 2024 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎవరినీ నిలబెట్టినా కార్యకర్తలంతా ఉత్సాహంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని సుబ్రమణ్యం తెలిపారు.
Read Also..
Read Also..