రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిస్తూ ప్రజలను వేదించుకుతింటున్న జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడమే లక్ష్యంగా ఇరు పార్టీల నాయకులు సమన్వయంతో కలిసి పోరాడాలని మార్కాపురం టీడీపీ ఇంచార్జ్ కందుల నారాయణరెడ్డి మరియు జనసేన ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాథ్లు టీడీపీ, జనసేన శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం మార్కాపురం పట్టణంలోనీ సౌజన్య ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన టీడీపీ – జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో మార్కాపురం నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఇరు పార్టీల ఇంచార్జ్ లు మాట్లాడుతూ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే వెనుకబడిన మార్కాపురం ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించడమే కాకుండా త్వరితగతిన వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి నీరు ఇస్తామని అన్నారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రజలు ఏవైతే కోల్పోయారో వాటిని తిరిగి ప్రజలకే ఇప్పించడం జరుగుతుందని అన్నారు. ప్రజలు ఎవరు కూడా భయపడనవసరం లేదని మీ వెంట టిడిపి, జనసేన నాయకులు ఉంటారని ఆ విధంగా ప్రజలకు ధైర్యం కల్పించి పార్టీ గెలుపు కోసం కలిసికట్టుగా సమన్వయంతో ముందుకు సాగుదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం జనసేన ఇన్చార్జ్ ఇమ్మడి కాశీనాథ్ మాట్లాడుతూ ఒకప్పుడు నేను కూడా టిడిపి సభ్యుడినేనని మా మధ్య ఎటువంటి బేదాభిప్రాయాలు లేవని అన్నదమ్ముల్లాగా కలసి ముందుకు సాగుతామని ఎవరు ఎటువంటి అపోహాలు పడవలసిన అవసరం లేదని అన్నారు. రాష్ట్రం అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి అన్నీ వర్గాలను వేదించటమే పనిగా పెట్టుకున్నారని, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సమిష్టి పోరాటానికి సిద్ధమయ్యారని, వారి ఆదేశాల మేరకు మార్కాపురం నియోజకవర్గంలో కూడా కలిసికట్టుగా కృషి చేసి, రాష్ట్రంలో వైసీపీని ఇంటికి పంపేందుకు ప్రతీ ఒక్కరూ సిద్ధంగా ఉండాలని ప్రతీ గ్రామంలో సమన్వయంతో పని చేసి రాష్ట్ర భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వంతోనే సాధ్యమని, రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన సైనికులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమన్వయ కమిటీ కార్యక్రమంలో టిడిపి నాయకులు వక్కలగడ్డ మల్లికార్జున, తాళ్లపల్లి సత్యనారాయణ, కాకర్ల శ్రీనివాసులు, రామాంజనేయరెడ్డి, జనసేన నాయకులు,షేక్ సాదిక్, కాశీ రత్నం, ఇరు పార్టీల ముఖ్య నాయకులు,టీడీపీ జనసేన కార్యకర్తలు, అభిమానులు, భారీ సంఖ్యలో పాల్గోన్నారు.
టీడీపీ – జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో కందుల, ఇమ్మడి
68
previous post