గుంటూరు తూర్పు నియోజకవర్గంలో జనసేన పార్టీ – టీడీపీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వడ్రానం మార్కండేయులు, నగర అధ్యక్షులు నేరెళ్ల సురేష్ పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలో ఇరు పార్టీలు కలిసికట్టుగా చెయ్యవలసిన రాజకీయ ప్రయాణం గురించి, ప్రజల సమస్యల గురించి చర్చించారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దాష్టీకాన్ని నిలువరిస్తూ… భవిష్యత్ కి మా గ్యారెంటీ అని భరోసా ఇచ్చి, గడప గడపకు ఉమ్మడి ప్రచార కార్యాచరణ నిర్వహించడం ఈ సమావేశ ముఖ్య ఉద్దేశమన్నారు. నేరేళ్ల సురేష్ గారు మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ రాష్ట్ర భవిష్యత్ కోసం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని, ఇరు పార్టీలు కలిస్తే 2014 ఎక్కడ పునరావృతం అవుతుందని అధికార పార్టీ నాయకుల్లో అలజడి మొదలయ్యిందన్నారు.
TDP And Janasena Alliance
పత్తిపాడు టిడిపి నియోజక వర్గ ఇంచార్జి రామాంజనేయులు పాయింట్స్ .. గుంటూరు…వైసీపీ కార్యక్రమాలు కాపీ కొట్టాల్సిన అవసరం టిడిపి, జనసేనలకు లేదు.. గుంటూరు లో టిడిపి. జనసేన పత్తిపాడు కార్యకర్తల ఆత్మీయ సమావేశం రాష్ట్రంలో టిడిపి రూపొందించిన సూపర్ సిక్స్ అంశాలతో పాటు జనసేన పొందుపరచిన ఐదు అంశాలను ప్రతి ఇంటికి తీసుకు వెళ్లతాం.. బిసి చట్టం ,అమ్మకు వందనం.కవుల రైతుల సమస్యలు లాంటివి ఎన్నో పరిష్కారం చేస్తామని వివరిస్తాం. రాష్ట్రంలో వైసీపీ కి ప్రత్యామ్నాయంగా టిడిపి ,జనసేన ప్రభుత్వానికి పట్టం కట్టాలని ప్రజలకి వివరిస్తాం…. ప్రతి పేదవాడి ని అభివృద్ధి పథంలో పాటు లక్షాధికారి ని చేయడమే మా ఇరు పార్టీల లక్ష్యం. ఎన్ టి ఆర్ పార్టీ పెట్టిన తరువాతే పేదవాడికి రెండు రూపాయలకి కిలో బియ్యం ప్రసాదించిన వరం గా భావించారు. టిడిపి కార్యక్రమాలు రూపకల్పన లాంటి అనేక విషయాలు ఇతర పార్టీల నేర్చుకోవాలి.
రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిస్తూ ప్రజలను వేదించుకుతింటున్న జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడమే లక్ష్యంగా ఇరు పార్టీల నాయకులు సమన్వయంతో కలిసి పోరాడాలని మార్కాపురం టీడీపీ ఇంచార్జ్ కందుల నారాయణరెడ్డి మరియు జనసేన ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాథ్లు టీడీపీ, జనసేన శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం మార్కాపురం పట్టణంలోనీ సౌజన్య ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన టీడీపీ – జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో మార్కాపురం నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఇరు పార్టీల ఇంచార్జ్ లు మాట్లాడుతూ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే వెనుకబడిన మార్కాపురం ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించడమే కాకుండా త్వరితగతిన వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి నీరు ఇస్తామని అన్నారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రజలు ఏవైతే కోల్పోయారో వాటిని తిరిగి ప్రజలకే ఇప్పించడం జరుగుతుందని అన్నారు. ప్రజలు ఎవరు కూడా భయపడనవసరం లేదని మీ వెంట టిడిపి, జనసేన నాయకులు ఉంటారని ఆ విధంగా ప్రజలకు ధైర్యం కల్పించి పార్టీ గెలుపు కోసం కలిసికట్టుగా సమన్వయంతో ముందుకు సాగుదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం జనసేన ఇన్చార్జ్ ఇమ్మడి కాశీనాథ్ మాట్లాడుతూ ఒకప్పుడు నేను కూడా టిడిపి సభ్యుడినేనని మా మధ్య ఎటువంటి బేదాభిప్రాయాలు లేవని అన్నదమ్ముల్లాగా కలసి ముందుకు సాగుతామని ఎవరు ఎటువంటి అపోహాలు పడవలసిన అవసరం లేదని అన్నారు. రాష్ట్రం అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి అన్నీ వర్గాలను వేదించటమే పనిగా పెట్టుకున్నారని, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సమిష్టి పోరాటానికి సిద్ధమయ్యారని, వారి ఆదేశాల మేరకు మార్కాపురం నియోజకవర్గంలో కూడా కలిసికట్టుగా కృషి చేసి, రాష్ట్రంలో వైసీపీని ఇంటికి పంపేందుకు ప్రతీ ఒక్కరూ సిద్ధంగా ఉండాలని ప్రతీ గ్రామంలో సమన్వయంతో పని చేసి రాష్ట్ర భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వంతోనే సాధ్యమని, రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన సైనికులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమన్వయ కమిటీ కార్యక్రమంలో టిడిపి నాయకులు వక్కలగడ్డ మల్లికార్జున, తాళ్లపల్లి సత్యనారాయణ, కాకర్ల శ్రీనివాసులు, రామాంజనేయరెడ్డి, జనసేన నాయకులు,షేక్ సాదిక్, కాశీ రత్నం, ఇరు పార్టీల ముఖ్య నాయకులు,టీడీపీ జనసేన కార్యకర్తలు, అభిమానులు, భారీ సంఖ్యలో పాల్గోన్నారు.
త్వరలో ఎన్నికలు సమీపిస్తున్న వేల వరికపూడి శాలా శంకుస్థాపన చేస్తారని చెప్పడం చాలా హస్యాద్పదంగా ఉందని ఆరోపించారు. వరికపూడి సాల ప్రాజెక్ట్ పూర్తి చేసేది జనసేన టిడిపి ప్రభుత్వమే . పల్నాడు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి బటన్ నొక్కడం తప్ప రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. మాచర్ల పట్టణంలో ప్రజలు తాగునీటికి తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. 2024 ఎలక్షన్ తర్వాత వైసీపీ పార్టీ భూస్థాపితం ఖాయం అని అరోపించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి పులి హరి మాచర్ల మండల అధ్యక్షుడు జి సాంబశివరావు వెల్దుర్తి అధ్యక్షుడు గంధం మల్లయ్య మరియు లాల్ కృష్ణ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Read Also..





Total views : 75373