టీడీపీ – జనసేన (TDP-Janasena):
టీడీపీ జనసేన పొత్తు ఎన్నికలు సమీపిస్తున్న వేళ రూరల్ తెలుగుదేశం పార్టీ నాయకులు పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని టీడీపీ నాయకులు అవేదన వ్యక్తం చేశారు. కాకినాడ రూరల్ 49 వ డివిజన్ మాజి కార్పొరేటర్ పాలిక ఉషారాణి నివాసం లో టీడీపీ బిసి నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గం లో సుమారు 82000 మంది శెట్టిబలిజ ఓటర్లు ఉన్నారని, ఇతర బిసి ఓటరులు సుమారు 50000 మంది ఉన్నారని అలాంటి నియోజకవర్గం లో బిసి లకు కాకుండా వేరే వర్గం వారికి సీటు కేటాయిస్తే తాము అంతా టీడీపీ కి వ్యతిరేకంగా పని చేస్తామని, ఇక్కడ గ్రామ స్థాయిలో పరిస్థితి అధిష్టానానికి తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఈ మీడియా సమావేశం నిర్వహించినట్లు తెలిపారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
పొత్తు లో బాగంగా అయిన ఈ నియోజకవర్గం కి ఎవరికి సీటు కేటాయిస్తారనే విషయం ఇప్పటివరకు తేల్చకుండా ఇరు పార్టీ నాయకుల్ని సమన్వయము చేయకుండా ఉన్నారని, ఇటువంటి పరిస్థితుల్లో కేవలం 20 రోజులు వ్యవధిలో ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ సీటు పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి కి కాకుండా వేరే వార్కి కేటాయిస్తే తాము అంతా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో శెట్టి బలిజ సాధికారిక జిల్లా అధ్యక్షులు పంపన బుజ్జి, మాజి జెడ్పీటీసీ బుంగా సింహాద్రి, పెరికి సాధికారిక జిల్లా అధ్యక్షులు నరసింహారావు, విశ్వ బ్రాహ్మిన సాధికారిక జిల్లా అధ్యక్షులు పండురు జయ కృష్ణా , ఇతర బిసి నాయకులు, తదితరులు పాల్గొన్నారు. Read Also..
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.