టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని(Pulivarthi Nani) ఇంటింటి ప్రచారం
తిరుచానూరు, చంద్రగిరి(chandragiri) తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని కి ఎన్నికల ప్రచారంలో ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తున్నది. అడుగడుగునా కర్పూర నిరాజనంతో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. తిరుపతి రూరల్ మండలం తనపల్లి పంచాయతీ హరిజనవాడ నుండి ఇంటింటి ప్రచారాని చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే(tdp mla) అభ్యర్థి పులివర్తి నాని ప్రారంభించారు. ముందుగా గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
“మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని”, “బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ” కార్యక్రమంలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ముందుగా జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు పులివర్తి నాని కి శాలువాలు కప్పి, గజ మాలతో, మహిళలు హారతులు పట్టి సాదర స్వాగతం పలికారు. స్థానికులు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థికి అద్భుతమైన ఆదరణ లభిస్తున్నది. తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులై తన పల్లి పంచాయతీ నల్లమాని కాలువలో సుమారు 15 కుటుంబాలు వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరారు, వీరికి పులివర్తి నాని పసువు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పులివర్తినారి పోరాట పట్టింపుకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు నాని గెలుపు కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చంద్రగిరి అభ్యర్థి పులివర్తి నాని మాట్లాడుతూ పల్లెలోని ప్రజలకు టీడీపీ ప్రభుత్వం లేకపోవడంతో ప్రజలతోపాటు నాయకులూ కూడా సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని రానున్న ఎమ్మెల్యే ఎన్నికలలో సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశం పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ సమస్యలకు ఆరు నెలల్లో పరిష్కారం చూపుతారని భరోసా ఇచ్చారు.
Follow us on : Google News , మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి