చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రపురం మండలంలోని పెన్షన్ లబ్ధిదారులకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చేతుల మీదుగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. దేసూరి కండ్రిగ, హరిజనవాడ, రామచంద్రపురం మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఉదయం 6 గంటలకే లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పింఛన్లను పంపిణీ చేసారు ఎమ్మెల్యే పులివర్తి నాని. ఎన్టిఆర్ భరోసా పింఛన్ పంపిణీ దేసూరి కండ్రిగ, హరిజనవాడ, రామచంద్రపురం మండలం లోని ప్రజలు ఎమ్మెల్యే చేతుల మీదుగా పెన్షన్ తీసుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. చంద్రగిరి పురంలో పులివర్తి నాని చేతుల మీదుగా పెన్షన్ పంపిణీ. పార్టీ కార్యకర్తలు, సచివాలయ ఉద్యోగులు, అధికారులతో కలిసి పెన్షన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే పులివర్తి నాని. పంపిణీని కేవలం రెండు రోజుల్లోనే నూరుశాతం అందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ పెన్షన్ పంపిణీ చేస్తున్నామని అన్నారు ఎమ్మెల్యే. ప్రజల వద్దకు ఎమ్మెల్యే వచ్చి పెన్షన్ పంపిణీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు పెన్షన్ దారులు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ చేసిన ఓ సైగ తీవ్ర రాజకీయ దుమారం రేపింది. మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్‌ను ఉద్దేశించి విజయ్ మాట్లాడుతున్న సమయంలో తన కుడి అరచేతిని దవడకు ఆనించి చేసిన సైగపై డీఎంకే తీవ్ర అభ్యంతరం వ్యక్తం…
- ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులను మరింత పెంచాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. న్యూఢిల్లీలో ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి, కేబినెట్ సభ్యుడు ఫ్రాన్సిస్కో పి.టు లారెల్ జూనియర్‌తో మంత్రి సమావేశమయ్యారు. తెలంగాణలో భారీగా వరి ఉత్పత్తి…
- హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.హైదరాబాద్ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ రంగంలో మరో కీలక ఘనతను అందుకోనుంది. భారత్‌లో తొలిసారిగా అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కాన్ఫరెన్స్ IREC-2026 హైదరాబాద్‌లో జరగనుంది. సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో మూడు రోజుల పాటు ఈ…
- వైసీపీకి గుడ్‌బై చెప్పిన చిన్న శ్రీను.ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళవారం వైసీపీకి రాజీనామా చేసిన చిన్న శ్రీను..…
- స్పీకర్‌పై వ్యాఖ్యల వెనుక ఫామ్‌హౌస్ కుట్ర: భట్టి.స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యల ఘటన వెనుక ఫామ్‌హౌస్ కుట్ర ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ వ్యవహారంలో పాత్రధారులు వేరని.. సూత్రధారులు వేరని, సూత్రధారులు చాలా ప్రమాదకరమని అన్నారు. దళిత వర్గాల నుంచి వచ్చి…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి