బాలల భవిషత్తు పైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉందని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. ఈనెల 14వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలలు పున: ప్రారంభమయైన విషయం తెలిసిందే.. ఇందులో భాగంగా మంగళవారం తిరుపతి రూరల్ మండలం, పెరుమాళ్లపల్లి పంచాయతీలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఎమ్మెల్యే పులివర్తి నాని పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఫర్నిచర్, కాంపౌండ్ వాల్, గ్రౌండ్ మరమ్మతులు వంటి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అలాగే మౌలిక సదుపాయాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఎమ్మెల్యే సన్మానించారు . బాలల భవిష్యత్తే… రాష్ట్ర భవిష్యత్తు…ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని, వాటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా బాలలు కార్మికులుగా మారుతున్నారని, అటువంటి వారిని గుర్తించి పాఠశాలల్లో చేర్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ చేసిన ఓ సైగ తీవ్ర రాజకీయ దుమారం రేపింది. మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్‌ను ఉద్దేశించి విజయ్ మాట్లాడుతున్న సమయంలో తన కుడి అరచేతిని దవడకు ఆనించి చేసిన సైగపై డీఎంకే తీవ్ర అభ్యంతరం వ్యక్తం…
- ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులను మరింత పెంచాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. న్యూఢిల్లీలో ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి, కేబినెట్ సభ్యుడు ఫ్రాన్సిస్కో పి.టు లారెల్ జూనియర్‌తో మంత్రి సమావేశమయ్యారు. తెలంగాణలో భారీగా వరి ఉత్పత్తి…
- హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.హైదరాబాద్ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ రంగంలో మరో కీలక ఘనతను అందుకోనుంది. భారత్‌లో తొలిసారిగా అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కాన్ఫరెన్స్ IREC-2026 హైదరాబాద్‌లో జరగనుంది. సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో మూడు రోజుల పాటు ఈ…
- వైసీపీకి గుడ్‌బై చెప్పిన చిన్న శ్రీను.ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళవారం వైసీపీకి రాజీనామా చేసిన చిన్న శ్రీను..…
- స్పీకర్‌పై వ్యాఖ్యల వెనుక ఫామ్‌హౌస్ కుట్ర: భట్టి.స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యల ఘటన వెనుక ఫామ్‌హౌస్ కుట్ర ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ వ్యవహారంలో పాత్రధారులు వేరని.. సూత్రధారులు వేరని, సూత్రధారులు చాలా ప్రమాదకరమని అన్నారు. దళిత వర్గాల నుంచి వచ్చి…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.