టీడీపీలో మూడో తరం నాయకత్వానికి శ్రీకారం..

Advertisements

<p>తెలుగుదేశం పార్టీలో మూడో తరం నాయకత్వానికి పునాది పడింది &period; టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు&comma; మంత్రి నారా లోకేష్ చేతిలోకి టీడీపీ పగ్గాలు అందాయి &period; పార్టీని ఇక మీదట ఆయన తన కనుసన్ననలో నడపబోతున్నారు&period; తెలుగుదేశం పార్టీకి ఆయన సర్వ సత్తాక అధినాయకుడు కాబోతున్నారు&period; చంద్రబాబు అధినేతగా ఉన్నా వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ పూర్తి బాధ్యతలను నిర్వహిస్తారు అని ఆపార్టీ నేతలు అంటున్నారు&period;తాజాగా టీడీపీ జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ చేత అధినేత హోదాలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయించారు&period; ఈ కార్యక్రమం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగింది &period; లోకేష్ తో పాటు మొత్తం 252 మందితో కూడిన జాతీయ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని టీడీపీ అధిష్టానం తాజాగా నియమించింది&period; ఇందులో కీలక నేతల ప్రమాణం అంతా చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగింది &period; ఇక ఈ కమిటీలలో నేతల ఎంపిక అన్నది సామాజికవర్గాల వారీగా ప్రాంతాల ఆధారంగా జరిగిందని చెబుతున్నారు&period; అంతే కాదు పార్టీలో సీనియర్లకు చోటు దక్కింది&period; అలాగే ఉత్సాహవంతులు అయిన జూనియర్లకు &comma; కొత్త వారికి కూడా సముచిత స్థానం లభించింది&period;<&sol;p>&NewLine;<p>నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కీలక బాధ్యతలు చేపట్టడంలో చాలా విశేషాలు ఉన్నాయి&period; తెలుగుదేశం పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అన్నది గతంలో ఎప్పుడు లేదు&period; టీడీపీ నాలుగున్నర దశాబ్దాల చరిత్రలో తొలిసారిగా సృష్టించిన ఈ పదవిలోకి లోకేష్ మొదటిసారి వచ్చారు &period; మరో వైపు లోకేష్ వయసు కంటే టీడీపీ వయస్సు పెద్దది&period; అలాంటి పార్టీ బాధ్యతలను ఆయన మోయనుండడం మరో విశేషం&period; చంద్రబాబు చేతికి టీడీపీ పగ్గాలు అందేనాటికి ఆయన వయసు 45 ఏళ్ళు&period; దాదాపుగా టీడీపీ పగ్గాలు అన్నీ లోకేష్ వే అన్నట్లుగా అందుతున్న ఈ పదవిని బాబు కంటే చిన్న వయసులోనే లోకేష్ దక్కించుకోవడం మరో విశేషం &period; టీడీపీని ఎన్టీఆర్ స్థాపించి 14 ఏళ్ళ పాటు నడిపారు&period; ఆయన తరువాత చంద్రబాబు మూడు దశాబ్దాల పాటు టీడీపీని మొత్తం తన భుజాన వేసుకున్నారు ఇపుడు లోకేష్ పసుపు పార్టీ భారం తాను తీసుకుంటున్నారు&period;<&sol;p>&NewLine;<p>ఇక కేవలం నెల కంటే తక్కువ సమయం టీడీపీ మహానాడుకు ఉంది&period; లోకేష్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టాక తొలి పార్టీ పండుగ అదే అవుతుంది &period; అంతే కాదు అతి పెద్ద టీడీపీ వేడుక కూడా అదే &period; దానిని లోకేష్ పూర్తిగా తన నాయకత్వ పటిమతో నిర్వహించనున్నారు&period; ఆ తరువాత స్థానిక సంస్థల ఎన్నికలు ఇదే ఏడాది జరగనున్నాయి&period; అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వ్యూహాలు ఇలా మొత్తం పార్టీ వ్యవహారాలలో లోకేష్ ది అతి ముఖ్య పాత్ర ఉంటుందని పార్టీ నేతలు అని అంటున్నారు&period; ఇదే క్రమంలో 2029 ఎన్నికలు కూడా లోకేష్ కి పెద్ద బాధ్యత కానున్నాయని చెప్పొచ్చు &period; బాబు సలహా సూచనలతో పార్టీని లోకేష్ నడిపినా భారంలో సింహ భాగం ఆయనదే అని అంటున్నారు&period; మొత్తానికి పార్టీ పరంగా లోకేష్ కు పట్టాభిషేకం జరిగిందని చెప్పొచ్చు &period; ఇక మిగిలింది ప్రభుత్వ పరంగా పట్టాభిషేకమే అని విశ్లేషకులు అంటున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జీటీ ఉత్కంఠభరిత విజయం – తేవాటియా శాంతమైన ముగింపు, గిల్-బట్లర్ ధాటికి ఆర్సీబీ పరాభవం..

గెటప్ శ్రీను వాగ్వాదం! “తొక్కలో ఇంటర్వ్యూ” అంటూ వెళ్ళిపోయిన గెటప్ శ్రీను?

నగర పంచాయతీగా మారినా పొదిలికి తప్పని కష్టాలు…