రాబోయే మూడు నెలల కాలంలో వైసీపీ అరాచక ప్రభుత్వం పోయి ప్రజా ప్రభుత్వం రాబోతోందని మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం జవహర్ నగర్ లో కందుల నారాయణ రెడ్డి నివాసం వద్ద టీడీపీ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పోల్ స్ట్రాటజిస్ట్ అశోక్ పాల్గొన్నారు. నారాయణరెడ్డి మాట్లాడుతూ బూత్ స్థాయిలో పార్టీ కార్యకర్తలు ఏ రకంగా ఓట్లు సాధించాలి, పోల్ మేనేజ్మెంట్ ను ఏ రకంగా మేనేజ్ చేయాలో కార్యకర్తలకు వివరించారు. మార్కాపురంలో వైసీపీ నాయకులు వందల ఎకరాలు ప్రభుత్వ, ప్రైవేటు భూములను దోచుకున్నారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వైసీపీ నాయకులు దోచుకున్న భూములను రికవరీ చేసి బాధితులకు అందజేస్తామన్నారు.
Read Also..
Read Also..