ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం మహమ్మదాపురం గ్రామంలో ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు విద్యార్థులను తీవ్రంగా కొట్టడం చాలా బాధాకరం అని విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు. నిరసనగా విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టారు. విద్యార్థుల పట్ల రాక్షసంగా ప్రవర్తించి, తెలుగు సబ్జెక్టులో తగ్గిన మార్కుకి ఒక దెబ్బ చొప్పున 20 మంది విద్యార్థులను తీవ్రంగా కొట్టడం చాలా దారుణం అన్నారు.
Siddipet Fire Accident : సబ్స్టేషన్లో భారీ అగ్నిప్రమాదం..!
విద్యార్థులపై దాడి చేసిన ఉపాధ్యాయుడిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మం , భద్రాద్రి కొత్త గూడెం ఉమ్మడి జిల్లాకి ఒక్కరే ఆర్ సి ఓ ఉండడం వల్లే ఈ ఘటన జరిగిందని,వెంటనే ఖమ్మం జిల్లా కి ప్రత్యేకం గా ఒక ఆర్ సి వో కేటాయించాలని వాళ్లు డిమాండ్ చేశారు. ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో జరిగిన సంఘటన పై తెలుగు ఉపాధ్యాయుడు లక్ష్మణ్ పై విచారణ జరిపి,తగు చర్యలు తీసుకుంటామని ఆర్ సి ఓ వెంకటేశ్వర్లు తెలిపారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.