ప్రపంచమే ఆశ్చర్యంలో భారతదేశం వైపు చూసేలా చేసిన అంతరిక్ష ప్రయోగం చంద్రయాన్ 3. అగ్రదేశాలతో పోలిస్తే. అత్యంత తక్కువ ఖర్చుతో అతి క్లిష్టమైన టాస్కు తీసుకొని సక్సెస్ అయిన చంద్రయాన్ 3 ప్రయోగం కారణంగా భారత కీర్తి ప్రతిష్టలు ప్రపంచ వ్యాప్తంగా అందరిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. చంద్రయాన్ 3 ప్రయోగ ప్రత్యేకత. ఇప్పటివరకు మరే దేశం కూడా చంద్రుడిలోని దక్షిణ ధ్రువ ప్రాంతానికి వెళ్లే ప్రయత్నాలు ఫలించకపోవటం తెలిసిందే.
ముందుగా అనుకున్నట్లే. చంద్రయాన్ 3 నుంచి సిగ్నళ్లు ఆగిపోయాయి. అద్భుత రీతిలో సిగ్నళ్లు వస్తాయని ఆశగా కొందరు చూసినప్పటికీ వారికి నిరాశే మిగిలింది. ఇలాంటి వేళ. అంచనాలకు భిన్నంగా అద్భుతం అన్న రీతిలో. నిద్రాణ స్థితిలోకి వెళ్లిపోయిన చంద్రయాన్ 3లో అమర్చిన పరికరాల నుంచి తాజాగా సిగ్నళ్లు అందుకున్నట్లుగా ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష ఒప్పందాల్లో భాగంగా చంద్రయాన్ 3 ల్యాండర్ లో నాసాకు చెందిన లూనార్ రికనిసెన్స్ ఆర్బిటర్ ను అమర్చారు. ఇందులోని లేజర్ రెట్రో రెఫ్లెక్టర్ ఎరే.. తాజాగా తన సేవల్ని పునరుద్ధరించినట్లుగా చెబుతున్నారు. భూమి మీద పదిహేను రోజులు చంద్రుడి మీద ఒక రోజుతో సమానమన్న సంగతి తెలిసిందే. పగటి వేళ ముగిసిన తర్వాత మొదలయ్యే రాత్రిళ్లు ఉష్ణోగ్రతలు అసాధారణంగా ఉండటంతో.. చంద్రయాన్ లోని పరికరాలు స్లీప్ మోడ్ లోకి వెళ్లిపోతాయి. వాటి నుంచి మళ్లీ మేల్కొనటం సాధ్యం కాదు. ఏదైనా అద్భుతం జరిగితే తప్పించి.. అవి నిద్రాణ స్థితి నుంచి మేల్కొనే వీల్లేదు. తాజాగా చంద్రయాన్ 3లో అమర్చిన పరికరాలు తమ నిద్రాణ స్థితి నుంచి బయటకు వచ్చి. తానున్న దక్షిణ ధ్రువంలోని లొకేషన్ మార్కర్ సేవల్ని పునరుద్దరించుకున్నట్లుగా తెలిపే సంకేతాల్ని పంపటం ఆసక్తికరంగా మారింది.