నేడు సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం

telangana cm revanth reddy

Advertisements

&NewLine;<p>తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి నేడు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది&period; ఈ ఉదయం కాంగ్రెస్ శాసన సభాపక్షం సమావేశం అవుతుంది&period; అనంతరం అధిష్ఠానంతో సంప్రదించిన తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది గవర్నర్‌కు తెలియజేస్తారు&period; అయితే&comma; పార్టీ వర్గాలు చెప్తున్న దాని ప్రకారం&period;&period; పీసీసీ అధ్యక్షుడు&comma; కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది&period;<br>పార్టీ సీనియర్ నేత భట్టి విక్రమార్క సహా పలువురు నేతలు సీఎం రేసులో ఉన్న నేపథ్యంలో సీఎల్పీ భేటీ తర్వాతనే సీఎం అభ్యర్థి పేరును ఖరారు చేస్తారని తెలుస్తోంది&period; నిజానికి గత రాత్రే సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పటికీ జిల్లాల్లో ఉన్న ఎమ్మెల్యేలు హైదరాబాద్ చేరుకునేందుకు సమయం పట్టే అవకాశం ఉండడంతో ఈ ఉదయం 9&period;30 గంటలకు సీఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు&period;<br>సీఎల్పీ తీర్మానాన్ని అధిష్ఠానానికి పంపి&period;&period; అక్కడి నుంచి వచ్చే సీఎం పేరును ఎమ్మెల్యేలకు చెప్పి అనంతరం గవర్నర్‌కు తెలియజేస్తారు&period; ఈ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల జాబితాను నేడు గవర్నర్‌కు ఈసీ అందిస్తుంది&period; ప్రస్తుత అసెంబ్లీని గవర్నర్ రద్దు చేసిన అనంతరం కొత్త సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది&period; ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ&comma; ప్రియాంక గాంధీతోపాటు పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే హాజరయ్యే అవకాశం ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..