తెలంగాణ ఎన్నికల ఫలితాల ఉత్కంఠకు తెరదిగింది. త్రిముఖ పోటీలో మెరుపు వేగంతో ప్రత్యేక తెలంగాణలో తొలిసారి కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సొంతం చేసుకుంది. 119 స్థానాల్లో పోటీ చేసి 64 స్థానాలను సొంతం చేసుకుంది. అధికారాన్ని హస్తగతం చేసుకునే మేజిక్ ఫిగర్ ను దాటేసింది. రేపు ప్రమాణస్వీకారానికి సిద్ధమైంది. ఆ పార్టీకి చెందిన సీనియర్లు కూడా ఈసారి గెలిచారు. ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచింది. సీఎం కేసీఆర్ కామారెడ్డిలో ఓటమి పాలయ్యారు. పలువురు మంత్రులు సైతం ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో 88 స్థానాల్లో గెలిచిన బీఆర్ఎస్ ఈసారి 39 స్థానాలకు పరిమితమైంది. సీఎం కేసీఆర్ సహా, పలువురు మంత్రులకు ఈసారి చేదు అనుభవం ఎదురైంది. ఇక బీజేపీ ఈసారి ఎన్నికల్లో పుంజుకుంది. సింగిల్ డిజిట్ కే పరిమితమైనప్పటికీ గతంలో కంటే ఈ సారి ఓట్లు, సీట్ల సంఖ్యను పెంచుకుంది. పలు చోట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు గట్టి పోటీ ఇచ్చింది. మొత్తం 111 స్థానాల్లో పోటీ చేసి 8 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. బీజేపీ మిత్రపక్షం జనసేన పోటీ చేసిన 8 స్థానాల్లో కనీసం పోటీని ఇవ్వలేకపోయింది. ఎంఐఎం ఏడు స్థానాల్లోనూ, సీపీఐ ఒక స్థానంలోనూ విజయం సాధించాయి.
ముగిసిన తెలంగాణ ఎన్నికల ఫలితాలు….
71
previous post