127
తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు భద్రతను తొలగించింది. గన్మన్లను తొలగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గన్మన్లను పోలీస్ శాఖ ఉపసంహరించుకుంటోంది. ఎవరికి గన్మన్లు అవసరమనే దానిపై ఇంటెలిజెన్స్ అధికారులు సమీక్షించనున్నారు. ఆ తర్వాతే మాజీలకు గన్మన్లను కేటాయిస్తారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఐఏఎస్, ఐపీఎస్‌లను బదిలీలపై దృష్టి సారించింది. ఇప్పుడు మాజీ మంత్రుల సెక్యూరిటీని తొలగించింది.