వరంగల్ జిల్లాకు చెందిన రితేశ్వరి ఆత్మహత్య కేసును గుంటూరు జిల్లా కోర్టు కొట్టివేసింది. ర్యాగింగ్, వేధింపుల ఆరోపణలతో 2015లో రితేశ్వరి ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో న్యాయం కోసం ఆమె తల్లిదండ్రులు తొమ్మిదేళ్లుగా పోరాడుతున్నారు. రితేశ్వరి తల్లిదండ్రులు ప్రస్తుతం రాజమహేంద్రవరంలో ఉంటున్నారు. నాగార్జున యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ విద్యార్థిని రితేశ్వరి ఆత్మహత్య కేసులో కోర్టు ఈ రోజు తీర్పును వెలువరించింది. ప్రాసిక్యూషన్ నేరం నిరూపించలేకపోయిందని చెబుతూ కోర్టు కేసును కొట్టివేసింది.
ర్యాగింగ్, వేధింపుల కారణంగా 2015లో రితేశ్వరి ఆత్మహత్య చేసుకుంది. తాను ర్యాగింగ్ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె సూసైడ్ నోట్ రాసింది. పెదకాకాని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేశారు. గుంటూరు కోర్టులో ఈ కేసు తొమ్మిదేళ్ల పాటు విచారణ జరగా.. కోర్టు తీర్పు వెలువరించింది.
రిషితేశ్వరి కేసుపై న్యాయస్థానం తీర్పు తర్వాత బాధితురాలి తల్లితండ్రులు స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె తల్లి దుర్గాబాయి మాట్లాడుతూ.. తొమ్మిదేళ్లుగా పోరాడుతున్నామని, న్యాయం జరుగుతుందని భావించామన్నారు. తమకు న్యాయం జరగలేదంటూ ఇంకెవరికీ న్యాయం జరగదని ఆమె అభిప్రాయపడ్డారు. అప్పీల్‌కు వెళ్లాలా లేదా అనే విషయాన్ని ఆలోచిస్తామని చెప్పారు. ఇక పోరాడే ఓపిక లేదని ఆమో ఆవేదన వ్యక్తం చేశారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- అమెరికాలో కాల్పులు… తెలుగు విద్యార్ధి మృతిఅమెరికాలో జరిగిన కాల్పుల్లో తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఓ విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. ఖమ్మం రూరల్ మండలం రామన్నపేటకు చెందిన నూకారపు కోటేశ్వరరావు కుమారుడు సాయి తేజ గత మూడు నెలల కిందట ఉన్నత చదువుల కోసం…
- నేటి నుంచి తిరుమలలో కొత్త రూల్తిరుమల శ్రీవారిని దర్శించుకునే రాజకీయ నాయకుల్లో పలువురు కొండపైన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ విమర్శలు చేస్తుండటం అందరికీ తెలిసింది. కొండపై రాజకీయ విమర్శలు చేయడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలో రాజకీయ…
- సంక్రాంతి కానుకగా కొత్త రేషన్ కార్డులుఅర్హులైన పేదలకు సంక్రాంతి కానుకగా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం డిసెంబరు 2 నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు, ఇతర సర్వీసులకు కూడా అవకాశం…
- న్యాయం చచ్చిపోయిందంటూ ఓ తల్లి ఆవేదనవరంగల్ జిల్లాకు చెందిన రితేశ్వరి ఆత్మహత్య కేసును గుంటూరు జిల్లా కోర్టు కొట్టివేసింది. ర్యాగింగ్, వేధింపుల ఆరోపణలతో 2015లో రితేశ్వరి ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో న్యాయం కోసం ఆమె తల్లిదండ్రులు తొమ్మిదేళ్లుగా పోరాడుతున్నారు. రితేశ్వరి తల్లిదండ్రులు ప్రస్తుతం…
- ఫెంగల్ తుపాను బీభత్సం… రాయలసీమకు హెచ్చరికబంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. ఈ తుపానుకు భారత వాతావరణ సంస్థ..ఐఎండీ ‘ఫెంగల్’ అని నామకరణం చేసింది. ప్రస్తుతం ఈ తుపాను పుదుచ్చేరికి 270 కిలోమీటర్లు, చెన్నైకి 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి