రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆలయ పరిసరాలను శుభ్రం చేయడంతో పాటు గెస్ట్ హౌజ్ లకు రంగులద్దుతున్నారు. ఆలయ పరిసరాలలో ఏపుగా పెరిగిన చెట్లను తొలగిస్తున్నారు. సీఎం రేవంత్ రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల దర్శనాలకు ఆలయ అధికారులు ఆంక్షలు విధించారు. వేములవాడ ఆలయ, పట్టణ అభివృద్ధి పనులకు తెలంగాణ ప్రభుత్వం 127 కోట్ల 65 లక్షల రూపాయలను ఇప్పటికే మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఆలయ విస్తరణతో పాటు పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. వేములవాడ రాజన్న దర్శనం తర్వాత నేడు వేములవాడ లో CM రేవంత్ భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో మోడీ భేటీ..ఆర్థిక నేరగాళ్లు విజయ్ మాల్యా, నీరవ్ మోదీని భారత్కు అప్పగించాలని ప్రధాని నరేంద్రమోడీ బ్రిటన్ ప్రధాని కీర్ స్మార్టర్ను కోరారు. బ్రెజిల్ వేదికగా జరుగుతున్న జీ20 సదస్సులో భాగంగా వివిధ దేశాధినేతలతో నరేంద్రమోడీ భేటీ అయ్యారు. బ్రిటన్ ప్రధానితోనూ…
- దమ్ముంటే అసెంబ్లీకి రా..చూసుకుందాంకాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి రైతు సంతోషంగా ఉన్నారని సీఎం రేవంత్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 66లక్షల ఎకరాల్లో 1 కోటి 53 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించామని.. ఇది ఒక చరిత్ర అని సీఎం…
- గుజరాత్ గులాం ఫై రేవంత్ రెడ్డి ఫైర్కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. ఇన్నాళ్లూ కిషన్ రెడ్డిపైన కొంత గౌరవం ఉండేదని.. అది కూడా పోగొట్టుకున్నాడని మండిపడ్డారు. ఇక ఆయన తట్టా బుట్టా సర్దుకొని గుజరాత్ కు వెళ్లిపోవాలని సూచించారు.…
- పవన్ కల్యాణ్ పై క్రిమినల్ కేసును ఎత్తివేసిన కోర్టుఏపీ డిప్యూటీ సీఎంపవన్ కల్యాణ్ పై క్రిమినల్ కేసును ఎత్తివేసిన కోర్టు పెద్ద ఊరటను కలిగించింది. ఆయనపై గతంలో నమోదైన క్రిమినల్ కేసును కోర్టు ఎత్తివేసింది. వాలంటీర్లను ఉద్దేశించి గతంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ… వాలంటీర్లు అసాంఘిక శక్తులుగా…
- మా రాష్ట్రాన్ని కాపాడండిమా రాష్ట్రాన్ని కాపాడండి… మణిపూర్ సంక్షోభంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. గత 18 నెలలుగా రాష్ట్రంలో అల్లర్లు కొనసాగుతున్నా ప్రజలకు భద్రత కల్పించడంలో మణిపూర్ ప్రభుత్వం,…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి