ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టులు కొనసాగుతాయని తెలిపారు. శాసన మండలి కాన్ఫరెన్స్ హాల్లో విలేఖరులతో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వం చట్ట ప్రకారం ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు. చట్ట ప్రకారం విచారణ పూర్తి కాకుండా నిందితులను అరెస్ట్ చేయలేమన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు కేంద్రం అనుమతించిందని తెలిపారు. ఫోన్ టాపింగ్ కేసులో క్లీన్ చిట్ వచ్చినట్లు బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. పంజాగుట్ట ప్రైవేట్ కేసు వ్యవహారంలో హరీష్ రావుకు క్లీన్ చిట్ వచ్చిందని.. కానీ ఫోన్ ట్యాపింగ్ కేసులో క్లీన్ చిట్ వచ్చినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నాడని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 6 వేల ఫోన్లు ట్యాపింగ్ కు గురయ్యాయని తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు స్టేట్మెంట్ అధికారులు రికార్డ్ చేస్తున్నారని చెప్పారు. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఇప్పటికే ఐఏఎస్ అరవింద్ కుమార్‌ని సస్పెండ్ చేశామని తెలిపారు.
#cm revanth reddy
నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్లేనని సీఎం రేవంత్ అన్నారు.
నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్లేనని సీఎం రేవంత్ అన్నారు. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఐలైన్ స్టూడియో కార్యాలయాన్ని హైటెక్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ అన్ని అవకాశాలను కల్పిస్తుందని నెట్ ఫ్లిక్స్ కు మా ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని చెప్పారు. బాల్యం నుంచే తనకు సినిమాలపై ఆసక్తి ఉందని తన చిన్నతనం నుంచి ఇప్పటి వరకు సినిమాలో అనేక మార్పులు వచ్చాయన్నారు. బాహుబలి, కల్కి, ట్రిపుల్ ఆర్, అరుంధతి వంటి అత్యున్నత సాంకేతికతో కూడిన సినిమాలు వచ్చాయని గుర్తు చేశారు. తెలుగు చిత్రపరిశ్రమను చెన్నై నుంచి ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు హైదరాబాద్‌కు తీసుకు వచ్చారన్నారు.
నెట్ ఫ్లిక్స్ కు దేశంలోనే హైదరాబాద్ ది రెండో కార్యాలయం అని సీఎం చెప్పారు. తమ దృష్టి హాలివుడ్ పైననే అని గతంలోనే చెప్పానని అన్నారు సీఎం. నెట్ ఫ్లిక్స్ తో తన కల నిజం కాబోతుందన్నారు. ఫోర్త్ సిటీని నిర్మిస్తున్నామని, విస్తరణకు.. పెద్ద ఆఫీస్ నిర్మాణానికి కావాల్సిన భూమి ఫ్యూచర్ సిటీలో ఇవ్వడానికి సిద్ధంగా తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. నెట్ ఫ్లిక్స్ కార్పొరేట్ ఆఫీస్ ను ఫ్యూచర్ సిటీకి తీసుకురావాలని కోరుతున్నానన్నారు. ప్రపంచంలో ఉన్న 500 పెద్ద కంపెనీలు తెలంగాణ కు తీసుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నామని పెట్టుబడులకు పూర్తి రక్షణ ఉంటుందని భరోసా ఇచ్చారు. తెలంగాణ అంటేనే వ్యాపారం అని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.
తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్–2026 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ అధికారులను ఉద్దేశించి కీలక సూచనలు చేశారు.
తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్–2026 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ అధికారులను ఉద్దేశించి కీలక సూచనలు చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి పోలీస్ అధికారులు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడంలో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. సమాజంలో ఎలాంటి సమస్య వచ్చినా ప్రజలు ముందుగా ఆశ్రయించేది పోలీసులనే అని ఆయన గుర్తుచేశారు. రిట్రీట్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం సమస్యలను గుర్తించి వాటి పరిష్కార మార్గాలను కనుగొనడమేనని సీఎం తెలిపారు. మనం ప్రస్తుతం ఎక్కడ ఉన్నామో అర్థం చేసుకుంటే, భవిష్యత్తులో ఎక్కడికి చేరుకోవాలో స్పష్టత వస్తుందని అన్నారు. అందుకే ఈ కార్యక్రమం ద్వారా పోలీస్ శాఖలో ఎదురవుతున్న సమస్యలను విశ్లేషించుకుని వాటికి తగిన పరిష్కారాలపై చర్చించామని వివరించారు. సమస్యలు సాధారణంగా రెండు రకాలుగా ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఒకటి టెక్నికల్ ఛాలెంజ్ కాగా, మరొకటి అడాప్టివ్ ఛాలెంజ్ అని పేర్కొన్నారు. టెక్నికల్ సమస్యలను వనరులు మరియు సమయం కేటాయిస్తే పరిష్కరించవచ్చని తెలిపారు. అయితే అడాప్టివ్ ఛాలెంజ్ విషయంలో సమస్య యొక్క అసలు కారణాలను లోతుగా అర్థం చేసుకోవడం చాలా అవసరమని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి శాంతిభద్రతలు అత్యంత ముఖ్యమని సీఎం స్పష్టం చేశారు. ఈ దిశగా రాష్ట్రంలో పాలసీ పెరాలసిస్ లేకుండా ముందుకు సాగేందుకు “తెలంగాణ రైజింగ్ 2047” అనే పాలసీ డాక్యుమెంట్‌ను ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని సుమారు 2100 కిలోమీటర్ల ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్‌గా అభివృద్ధి చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు.
దేశంలోని ఇతర మెట్రో నగరాల పరిస్థితులను కూడా సీఎం ఉదాహరణగా ప్రస్తావించారు. ఢిల్లీ నగరం కాలుష్య సమస్యతో బాధపడుతుండగా, బెంగళూరు ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటోందని అన్నారు. ముంబై, చెన్నై నగరాలు వరదల సమస్యను తరచుగా ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ఈ పరిస్థితుల నుంచి పాఠాలు నేర్చుకుని తెలంగాణలో ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. పోలీసింగ్ వ్యవస్థ కూడా కాలానుగుణంగా మారాల్సిన అవసరం ఉందని సీఎం చెప్పారు. ఒకప్పుడు తీవ్రవాదం పెద్ద సమస్యగా ఉండేదని, దాన్ని ఎదుర్కొనేందుకు ఆక్టోపస్, గ్రేహౌండ్స్ వంటి ప్రత్యేక దళాలను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఫిజికల్ క్రైమ్ నియంత్రణ కోసం ఇప్పటివరకు పలు వ్యవస్థలు ఏర్పాటు చేసినప్పటికీ, ప్రస్తుతం నేరాల స్వరూపం మారిందని తెలిపారు.
ప్రస్తుతం సైబర్ క్రైమ్ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో పోలీస్ వ్యవస్థను కూడా సాంకేతికంగా అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం కలిగిన అధికారులను నియమించుకోవడంతో పాటు ఇప్పటికే ఉన్న సిబ్బందికి కూడా నూతన శిక్షణ ఇవ్వాలని సూచించారు. పోలీస్ శాఖలో సిబ్బంది మరియు అధికారులను నిరంతరం అప్డేట్ చేయకపోతే నేరాలను సమర్థవంతంగా అడ్డుకోవడం కష్టమవుతుందని హెచ్చరించారు. ఈ రిట్రీట్ కార్యక్రమంలో సైబర్ క్రైమ్, నార్కోటిక్స్, రిక్రూట్మెంట్ తదితర అంశాలకు సంబంధించిన పలు సమస్యలపై అధికారులు తమ ప్రతిపాదనలు సమర్పించినట్లు సీఎం తెలిపారు. ఈ ప్రతిపాదనలను సమగ్రంగా పరిశీలించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఆ కమిటీ నివేదిక ఆధారంగా అవసరమైతే చట్టపరమైన మార్పులు తీసుకొచ్చే అవకాశముందని తెలిపారు.
ఈ నెల 8న ఉదయం 9.30 గంటలకు శాసన మండలి హల్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుందని
అసెంబ్లీలో ప్రాంగణంలో శాసనమండలి భవనం పునర్నిర్మాణ పనులు చాలా వేగంగా నడుస్తున్నాయని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 8న ఉదయం 9.30 గంటలకు శాసన మండలి హల్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుందని, సీఎం రేవంత్ రెడ్డి నూతన తెలంగాణ శాసన మండలిని ప్రారంభోత్సవం చేస్తారని తెలిపారు. హైదరాబాద్ లోని మండలి ఛాంబర్ లో ఆయన మీడియాతో చిట్ చాట్‌లో మాట్లాడారు. వచ్చే బడ్జెట్ సమావేశాలు అక్కడ నుంచి ప్రారంభం అవుతాయన్నారు. ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు అందరికీ సెంట్రల్ హాల్ నిర్మాణం జరుగుతుందని, దాదాపు 30 కోట్ల వ్యయంతో శాసన మండలి పనులు పూర్తి చేశారని గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు. దాదాపు 99 శాతం పనులు అయిపోయాయని, ఏపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అమరావతికి వెళ్లిన తర్వాత ఆ భవనం ఖాళీగా ఉందని, దాన్ని అలాగే వదిలేస్తే బిల్డింగ్ శిథిలావస్థకు చేరుకునేలా ఉందన్నారు.
ఆ హెరిటేజ్ బిల్డింగ్‌ను కాపాడుకొని, అసెంబ్లీని సుందరంగా మార్చుకోవాలనే ఆలోచన చేశామని తెలిపారు. ఒకే చోట శాసనసభ, శాసన మండలి ఉండాలనే గొప్ప సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి పునర్నిర్మాణ పనులను ప్రారంభించారని, పార్లమెంట్ తరహాలో తెలంగాణ శాసనసభ ఉండబోతుందని గుత్తా చెప్పారు. ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, అధికారులకు, మంత్రులకు ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. బడ్జెట్ సెషన్స్ తర్వాత సెంట్రల్ హాల్ ఏర్పాటు చేస్తామని, ఈ పనులు పూర్తి కావడానికి ఏడాదిన్నర సమయం పట్టిందని, హెరిటేజ్ భవనం కావడంతో చాలా జాగ్రత్తగా పనులు చేయాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. మరో 40 నుంచి 50 సంవత్సరాల వరకు ఈ శాసన మండలి భవనానికి ఢోకా లేదన్నారు.
అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసే తెలంగాణ తల్లి విగ్రహం మార్చి 8 లోపు నిర్మాణం పూర్తి అయితే అదే రోజు విగ్రహ ఆవిష్కరణ చేస్తామని గుత్తా తెలిపారు. ఆదర్శ నగర్ లోని 9 ఎకరాల ల్యాండ్ లో కన్స్టిట్యూషన్ క్లబ్ నిర్మాణం చేపట్టబోతున్నట్లుగా ఆయన వివరించారు. మన రాష్ట్ర శాసన పరిషత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని, మిగిలిన రాష్ట్రాలు కూడా మన తరహాలో సభ సమావేశ హాల్స్ నిర్మించుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం నిర్మాణం చేపట్టిందన్నారు. ప్రస్తుతం ఉన్న తెలంగాణ శాసన మండలిని, జూబ్లీహాల్ ను పునరుద్ధరణ చేసి ప్రభుత్వ కార్యక్రమాలకు వాడుకునే ఆలోచనలో సర్కార్ ఉందని గుత్తా తెలిపారు. డ్రైనేజ్, ఫ్లోరింగ్, ఎలక్ట్రిసిటీ, సీఎం ఛాంబర్, చైర్మన్, వైస్ చైర్మన్ ఛాంబర్, సెక్రటరీ ఆఫీస్, కౌన్సిల్ సెక్రెటరీయేట్, సభ్యులకు మీడియా పాయింట్, మీడియా కోసం మీడియాకు హాల్‌ను నిర్మించినట్లుగా గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు.
ప్రస్తుత రాజకీయాల్లో ప్రశాంతంగా ఉన్నానని, అవకాశం ఇస్తే శాసన మండలిలో ఉంటానని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం అన్న వాళ్ళు సైలెంట్ అయ్యారని, ప్రజా పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికలు జమిలి ఎన్నికలని, నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది.. మహిళా రిజర్వేషన్లు వస్తాయి.. రాజకీయంగా చాలా మార్పులు వస్తాయని గుత్తా తెలిపారు. రిజర్వేషన్లు మారతాయని, తమ కుమారుడు గుత్తా అమిత్ రెడ్డికి ఎక్కడ అవకాశం వస్తే అక్కడి నుంచి పోటీలో ఉంటాడని ఆయన తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఎక్కడి నుంచి పోటీ చేస్తాడు అనేది చెప్పలేనని, ఖచ్చితంగా పోటీలో అమిత్ ఉంటాడని గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు.
కొత్త పెళ్లికూతురు రష్మిక మందన్న తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో ఏడడుగులు వేసిన రష్మిక, సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. అక్కడ సీఎం కుటుంబ సభ్యులతో ఆమె కాసేపు ఆప్యాయంగా గడిపారు. తమ వివాహ రిసెప్షన్ కు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ విషయాన్ని రష్మిక స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆయన అర్ధాంగి గీత, ఆయన కుమార్తె నైమిషలను కలవడం చాలా సంతోషంగా ఉందని రష్మిక పేర్కొన్నారు. వారితో గడిపిన సమయం, జరిపిన సంభాషణలు చాలా మధురంగా సాగాయని తెలిపారు. ఈ కలయికలో సీఎం అర్ధాంగి గీత, రష్మికకు ఒక ప్రత్యేక బహుమతిని అందజేశారు. ఆ గిఫ్ట్ పట్ల మురిసిపోయిన రష్మిక, ఆమెకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.”గీత గారు ఇచ్చిన బహుమతి చాలా అందంగా ఉంది. దీన్ని నేను కచ్చితంగా ఏదైనా అత్యంత ప్రత్యేకమైన సందర్భంలో ధరిస్తాను” అని రష్మిక పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి కుటుంబంతో రష్మిక దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్ దేవరకొండను పెళ్లాడిన తర్వాత రష్మిక సీఎం కుటుంబాన్ని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది
తెలంగాణ తల్లి విగ్రహం రూపంపై ఇప్పటికిఏ అధికారిక గుర్తింపుహోదా లేదని, మేము చక్కటి రూపం తో విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తెలిపారు. మెడకు కంటె, గుండపూసల హారం, చెవులకు బుట్టకమ్మలు, ముక్కుపుడక, బంగారు అంచుతో కూడిన చీరతో చాకలి ఐలమ్మ, సమ్మక్క-సారలమ్మ స్ఫూర్తితో తెలంగాణ తల్లి రూపం ఉందన్నారు. కుడి చేతితో జాతికి అభయమిస్తూ.. ఎడమ చేతిలో పంటలతో తల్లి దర్శనమిస్తుందన్నారు. ‘తెలంగాణ తల్లి వేరు, దేవత వేరు. ఏ తల్లికీ కిరీటం ఉండదు.. దేవతలకు మాత్రమే కిరీటం ఉంటుంది. ప్రభుత్వం ఆవిష్కరిస్తున్నది తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాత్రమే. ఉద్యమంలో ముందుకు నడిపించిన మూర్తి తెలంగాణ తల్లి. తెలంగాణ తల్లిపై ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలి. ‘ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలను పక్కనపెట్టి.. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణలో పాల్గొనాలని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. కేసీఆర్ సభకు హాజరై.. తన అనుభవంతో తమకు దిశానిర్దేశం చేస్తారని అనుకున్నామని శ్రీధర్ బాబు తెలిపారు. ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టినప్పుడు.. దానిలోనూ రాజకీయాలను వెతకడం కరెక్ట్ కాదన్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- హైదరాబాద్ మెట్రో రెండోదశకు కేంద్రం అంగీకారం…హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో సమావేశమయ్యారు కిషన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో కొనసాగుతున్న వివిధ కీలక ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. నగరాభివృద్ధి,…
- సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్‌తో రాయల్స్ ప్లేఆఫ్ రేస్‌లోకి తిరిగి..సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్‌తో రాయల్స్ ప్లేఆఫ్ రేస్‌లోకి తిరిగి.. ఈ సీజన్లో జైపూర్‌లో వచ్చిన మొదటి విజయం రాజస్థాన్ రాయల్స్‌కు (Royals) అత్యంత సరైన సమయంలో వచ్చింది. వరుసగా 3 పరాజయాల తర్వాత వారు తిరిగి పుంజుకుని, ప్లేఆఫ్స్ స్థానం…
- రమణి కళ్యాణం ట్రైలర్.. పక్కా ఫీల్‌గుడ్ ఎంటర్టైనర్ ..ఈ మధ్యకాలంలో ప్రేక్షకులు భారీ యాక్షన్, హంగామా కంటే మనసుకు దగ్గరయ్యే కథలకే ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీతో కలిసి చూసేలా ఉండే క్లీన్ ఎమోషనల్ ఎంటర్టైనర్స్ కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. అలాంటి సమయంలో రమణీ కళ్యాణం మంచి ఫీల్‌గుడ్…
- భారీ సర్ప్రైజ్ తో ‘హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్’ తెలుగు ట్రైలర్ – హీ-మ్యాన్‌గా నిఖిల్ సిద్ధార్థ వాయిస్ …హాలీవుడ్లో అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం ‘హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్’ ఇప్పుడు ఇండియన్ ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన ఇంగ్లీష్ ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించగా, తాజాగా విడుదలైన తెలుగు ట్రైలర్ తెలుగు…
- ప్రధాని మోదీపై నార్వే పత్రిక విషం కక్కింది.ప్రధాని మోదీపై నార్వే పత్రిక విషం కక్కింది. ఆయనను పాములు ఆడించే వాడిగా చిత్రీకరించింది. తమ జాత్యహంకారాన్ని అలా నిరూపించుకుంది. నార్వేకు చెందిన ఆఫెన్ పోస్టెన్ అనే పత్రిక వేసిన ఆ కార్టూన్ ఇప్పుడు తీవ్ర విమర్శలకు ఆస్కారం ఇచ్చింది. దీనికి…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను గాలికి వదిలేశారన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 56 వేల ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కేసీఆర్ పదేళ్ల పాలనలో నిరుద్యోగులను పట్టించుకోలేదన్నారు.. రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క ఉద్యోగాన్ని కూడా కేసీఆర్ భర్తీ చేయలేదన్నారు అన్ని రంగాలను అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ ప్ర్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- హైదరాబాద్ మెట్రో రెండోదశకు కేంద్రం అంగీకారం…హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో సమావేశమయ్యారు కిషన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో కొనసాగుతున్న వివిధ కీలక ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. నగరాభివృద్ధి,…
- సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్‌తో రాయల్స్ ప్లేఆఫ్ రేస్‌లోకి తిరిగి..సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్‌తో రాయల్స్ ప్లేఆఫ్ రేస్‌లోకి తిరిగి.. ఈ సీజన్లో జైపూర్‌లో వచ్చిన మొదటి విజయం రాజస్థాన్ రాయల్స్‌కు (Royals) అత్యంత సరైన సమయంలో వచ్చింది. వరుసగా 3 పరాజయాల తర్వాత వారు తిరిగి పుంజుకుని, ప్లేఆఫ్స్ స్థానం…
- రమణి కళ్యాణం ట్రైలర్.. పక్కా ఫీల్‌గుడ్ ఎంటర్టైనర్ ..ఈ మధ్యకాలంలో ప్రేక్షకులు భారీ యాక్షన్, హంగామా కంటే మనసుకు దగ్గరయ్యే కథలకే ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీతో కలిసి చూసేలా ఉండే క్లీన్ ఎమోషనల్ ఎంటర్టైనర్స్ కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. అలాంటి సమయంలో రమణీ కళ్యాణం మంచి ఫీల్‌గుడ్…
- భారీ సర్ప్రైజ్ తో ‘హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్’ తెలుగు ట్రైలర్ – హీ-మ్యాన్‌గా నిఖిల్ సిద్ధార్థ వాయిస్ …హాలీవుడ్లో అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం ‘హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్’ ఇప్పుడు ఇండియన్ ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన ఇంగ్లీష్ ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించగా, తాజాగా విడుదలైన తెలుగు ట్రైలర్ తెలుగు…
- ప్రధాని మోదీపై నార్వే పత్రిక విషం కక్కింది.ప్రధాని మోదీపై నార్వే పత్రిక విషం కక్కింది. ఆయనను పాములు ఆడించే వాడిగా చిత్రీకరించింది. తమ జాత్యహంకారాన్ని అలా నిరూపించుకుంది. నార్వేకు చెందిన ఆఫెన్ పోస్టెన్ అనే పత్రిక వేసిన ఆ కార్టూన్ ఇప్పుడు తీవ్ర విమర్శలకు ఆస్కారం ఇచ్చింది. దీనికి…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అభివృద్ధి ప్రాజెక్టుల కోసం సేకరించే భూమికి రైతులకు రెండు రెట్ల పరిహారం ఇస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. భూములు తీసుకుని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలా పరిహారం ఇవ్వకుండా తప్పించుకోమన్నారు. తెలంగాణకు పరిశ్రమలు వద్దని బీఆర్ఎస్ కోరుకుంటుందా అని సీఎం ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సక్రమంగా పరిహారం ఇవ్వలేదన్నారు. కుట్రలు చేసిన వాళ్లు ఊచలు లెక్కపెట్టాల్సిందే.. అంటూ కేటీఆర్ ను హెచ్చరించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- హైదరాబాద్ మెట్రో రెండోదశకు కేంద్రం అంగీకారం…హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో సమావేశమయ్యారు కిషన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో కొనసాగుతున్న వివిధ కీలక ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. నగరాభివృద్ధి,…
- సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్‌తో రాయల్స్ ప్లేఆఫ్ రేస్‌లోకి తిరిగి..సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్‌తో రాయల్స్ ప్లేఆఫ్ రేస్‌లోకి తిరిగి.. ఈ సీజన్లో జైపూర్‌లో వచ్చిన మొదటి విజయం రాజస్థాన్ రాయల్స్‌కు (Royals) అత్యంత సరైన సమయంలో వచ్చింది. వరుసగా 3 పరాజయాల తర్వాత వారు తిరిగి పుంజుకుని, ప్లేఆఫ్స్ స్థానం…
- రమణి కళ్యాణం ట్రైలర్.. పక్కా ఫీల్‌గుడ్ ఎంటర్టైనర్ ..ఈ మధ్యకాలంలో ప్రేక్షకులు భారీ యాక్షన్, హంగామా కంటే మనసుకు దగ్గరయ్యే కథలకే ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీతో కలిసి చూసేలా ఉండే క్లీన్ ఎమోషనల్ ఎంటర్టైనర్స్ కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. అలాంటి సమయంలో రమణీ కళ్యాణం మంచి ఫీల్‌గుడ్…
- భారీ సర్ప్రైజ్ తో ‘హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్’ తెలుగు ట్రైలర్ – హీ-మ్యాన్‌గా నిఖిల్ సిద్ధార్థ వాయిస్ …హాలీవుడ్లో అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం ‘హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్’ ఇప్పుడు ఇండియన్ ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన ఇంగ్లీష్ ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించగా, తాజాగా విడుదలైన తెలుగు ట్రైలర్ తెలుగు…
- ప్రధాని మోదీపై నార్వే పత్రిక విషం కక్కింది.ప్రధాని మోదీపై నార్వే పత్రిక విషం కక్కింది. ఆయనను పాములు ఆడించే వాడిగా చిత్రీకరించింది. తమ జాత్యహంకారాన్ని అలా నిరూపించుకుంది. నార్వేకు చెందిన ఆఫెన్ పోస్టెన్ అనే పత్రిక వేసిన ఆ కార్టూన్ ఇప్పుడు తీవ్ర విమర్శలకు ఆస్కారం ఇచ్చింది. దీనికి…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నవి సీఎం విజయోత్సవం కాదు.. అసత్యోత్సవాలు చేసుకోవాలి.. అని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి విజయోత్సవాలకు ఎలాంటి అవకాశం లేకపోవడంతోనే ప్రధానిపై ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మీ పదవిని కాపాడుకునేందుకు సోనియా కాళ్లు కడిగి నెత్తిన పోసుకుంటానని అంటున్నారని ధ్వజమెత్తారు. అవకాశవాద రాజకీయాలకు రేవంత్ పెట్టిందని పేరని, విపక్షాలను తిట్టేందుకు సమావేశాలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు 400 హామీలు ఇచ్చారని, కనీసం ఆరు హామీలను కూడా అమలు చేయలేక చేతులెత్తేశారని మండిపడ్డారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూలగొట్టడం ఎంతవరకు సమంజమని ప్రశ్నించారు. కాళేశ్వరం విషయంలో ప్రగల్బాలు పలికిన సీఎం రేవంత్ రెడ్డి.. గొంతు ఎందుకు మూగబోయిందని నిలదీశారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- హైదరాబాద్ మెట్రో రెండోదశకు కేంద్రం అంగీకారం…హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో సమావేశమయ్యారు కిషన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో కొనసాగుతున్న వివిధ కీలక ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. నగరాభివృద్ధి,…
- సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్‌తో రాయల్స్ ప్లేఆఫ్ రేస్‌లోకి తిరిగి..సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్‌తో రాయల్స్ ప్లేఆఫ్ రేస్‌లోకి తిరిగి.. ఈ సీజన్లో జైపూర్‌లో వచ్చిన మొదటి విజయం రాజస్థాన్ రాయల్స్‌కు (Royals) అత్యంత సరైన సమయంలో వచ్చింది. వరుసగా 3 పరాజయాల తర్వాత వారు తిరిగి పుంజుకుని, ప్లేఆఫ్స్ స్థానం…
- రమణి కళ్యాణం ట్రైలర్.. పక్కా ఫీల్‌గుడ్ ఎంటర్టైనర్ ..ఈ మధ్యకాలంలో ప్రేక్షకులు భారీ యాక్షన్, హంగామా కంటే మనసుకు దగ్గరయ్యే కథలకే ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీతో కలిసి చూసేలా ఉండే క్లీన్ ఎమోషనల్ ఎంటర్టైనర్స్ కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. అలాంటి సమయంలో రమణీ కళ్యాణం మంచి ఫీల్‌గుడ్…
- భారీ సర్ప్రైజ్ తో ‘హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్’ తెలుగు ట్రైలర్ – హీ-మ్యాన్‌గా నిఖిల్ సిద్ధార్థ వాయిస్ …హాలీవుడ్లో అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం ‘హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్’ ఇప్పుడు ఇండియన్ ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన ఇంగ్లీష్ ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించగా, తాజాగా విడుదలైన తెలుగు ట్రైలర్ తెలుగు…
- ప్రధాని మోదీపై నార్వే పత్రిక విషం కక్కింది.ప్రధాని మోదీపై నార్వే పత్రిక విషం కక్కింది. ఆయనను పాములు ఆడించే వాడిగా చిత్రీకరించింది. తమ జాత్యహంకారాన్ని అలా నిరూపించుకుంది. నార్వేకు చెందిన ఆఫెన్ పోస్టెన్ అనే పత్రిక వేసిన ఆ కార్టూన్ ఇప్పుడు తీవ్ర విమర్శలకు ఆస్కారం ఇచ్చింది. దీనికి…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి రైతు సంతోషంగా ఉన్నారని సీఎం రేవంత్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 66లక్షల ఎకరాల్లో 1 కోటి 53 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించామని.. ఇది ఒక చరిత్ర అని సీఎం రేవంత్ అన్నారు. కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి రా..చూసుకుందాం అంటూ రేవంత్ సవాల్ విసిరాడు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- హైదరాబాద్ మెట్రో రెండోదశకు కేంద్రం అంగీకారం…హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో సమావేశమయ్యారు కిషన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో కొనసాగుతున్న వివిధ కీలక ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. నగరాభివృద్ధి,…
- సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్‌తో రాయల్స్ ప్లేఆఫ్ రేస్‌లోకి తిరిగి..సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్‌తో రాయల్స్ ప్లేఆఫ్ రేస్‌లోకి తిరిగి.. ఈ సీజన్లో జైపూర్‌లో వచ్చిన మొదటి విజయం రాజస్థాన్ రాయల్స్‌కు (Royals) అత్యంత సరైన సమయంలో వచ్చింది. వరుసగా 3 పరాజయాల తర్వాత వారు తిరిగి పుంజుకుని, ప్లేఆఫ్స్ స్థానం…
- రమణి కళ్యాణం ట్రైలర్.. పక్కా ఫీల్‌గుడ్ ఎంటర్టైనర్ ..ఈ మధ్యకాలంలో ప్రేక్షకులు భారీ యాక్షన్, హంగామా కంటే మనసుకు దగ్గరయ్యే కథలకే ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీతో కలిసి చూసేలా ఉండే క్లీన్ ఎమోషనల్ ఎంటర్టైనర్స్ కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. అలాంటి సమయంలో రమణీ కళ్యాణం మంచి ఫీల్‌గుడ్…
- భారీ సర్ప్రైజ్ తో ‘హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్’ తెలుగు ట్రైలర్ – హీ-మ్యాన్‌గా నిఖిల్ సిద్ధార్థ వాయిస్ …హాలీవుడ్లో అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం ‘హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్’ ఇప్పుడు ఇండియన్ ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన ఇంగ్లీష్ ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించగా, తాజాగా విడుదలైన తెలుగు ట్రైలర్ తెలుగు…
- ప్రధాని మోదీపై నార్వే పత్రిక విషం కక్కింది.ప్రధాని మోదీపై నార్వే పత్రిక విషం కక్కింది. ఆయనను పాములు ఆడించే వాడిగా చిత్రీకరించింది. తమ జాత్యహంకారాన్ని అలా నిరూపించుకుంది. నార్వేకు చెందిన ఆఫెన్ పోస్టెన్ అనే పత్రిక వేసిన ఆ కార్టూన్ ఇప్పుడు తీవ్ర విమర్శలకు ఆస్కారం ఇచ్చింది. దీనికి…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Total views : 81445