రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా ఈరోజు షాబాద్ మండలంలోని పోలారం, గోపి గడ్డ మరియు సీతారాంపురం గ్రామాలలో ప్రచారాన్ని నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భీమ్ భరత్. ఈ నేపథ్యంలో ఆయన సీతారాంపురం లో ఉన్న శ్రీ సీతారాముల స్వామి దేవస్థానాన్ని దర్శించుకుని అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు…
సీతారాంపూర్ లో ఉన్న శ్రీ సీతారాముల స్వామి సాక్షిగా కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ఎలాంటి పక్షపాతం చూపించకుండా, కుటుంబ పాలన చేయకుండా ప్రజలకే నా సేవ అంకితం చేస్తానని ఆయన సీతారాముల సాక్షిగా ప్రమాణం చేశాడు. ఈ నేపథ్యంలో కెసిఆర్ రైతుబంధు గురించి చెప్పిన మాటలకు ఆయన కౌంటర్ ఇస్తూ..
రైతుబంధు అనేది కాంగ్రెస్ పార్టీ ఆప్తే ఆగేది కాదని ఎలక్షన్ ఉన్నందున ఎలక్షన్ కమిషన్ ఆపేసిందని ఈ విషయం తెలియని కెసిఆర్ సోయండి మాట్లాడుతున్నాడా లేక తాగి మాట్లాడుతున్నాడో తెలియడం లేదని లేక మందేసి మాట్లాడుతున్నాడో నాకు అర్ధం కావడం లేదనీ కౌంటర్ ఇచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు రైతుబంధును అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను అమలు చేస్తామని ఈ సంద్భంగా ఆయన మీడియాతో తెలిపారు.
Read Also…
Read Also…