ఎమ్మెల్యేలు వరుసగా పార్టీని వీడుతుండడం రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న వలసలు బీఆర్ఎస్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. ఎప్పుడు ఎవరు వెళ్లిపోతారో తెలియక గందరగోళం నెలకొంది. గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి హస్తం కండువా కప్పుకోవడం ఆ పార్టీని షాక్ కు గురి చేసింది. ఇది జరిగిన కొద్ది గంటల్లోనే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన గులాబీ ఎమ్మెల్యేలు , ఇన్చార్జ్ మంత్రి శ్రీధర్ బాబును కలవడం హాట్ టాపిక్ గా మారింది. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కలిశామని వారు చెబుతున్నారు.. కాంగ్రెస్ లోకి చేరేందుకే భేటీ అయ్యారని సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతున్నది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ వివేకానంద మాధవరం కృష్ణారావు, సుధీర్ రెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, రాజశేఖర్ రెడ్డి సెక్రటేరియట్లో మంత్రి శ్రీధర్ బాబు తో భేటీ అయ్యారు. వీరిలో అరికెపూడి గాంధీ, వివేకానంద, కృష్ణారావులకు గతంలో టీడీపీ తో అనుబంధం ఉంది. సుధీర్ రెడ్డి, లక్ష్మారెడ్డిలకు గతంలో కాంగ్రెస్తో అనుబంధం ముంది. ఆరుగురు ఎమ్మెల్యేలు ఒకేసారి ప్రభుత్వంలో కీలకమైన మంత్రిని సెక్రటేరియట్ లో కలవడం పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ నుంచి అన్ని రకాల హామీలు లభిస్తే, నేడో, రేపో ఆ ఎమ్మెల్యేలు కూడా హస్తం కండువా కప్పుకోవచ్చనే చర్చ జరుగుతున్నది. అయితే అభివృద్ధి కోసమే తాము మంత్రిని కలిశామని సదరు ఎమ్మెల్యేలు చెబుతున్నా, చేరికలపై వస్తున్న వార్తలను వారు ఖండించకపోవడం ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చినట్లయింది. మరోవైపు ఆయా ఎమ్మెల్యేలు శనివారమే సీఎం సమక్షంలో పార్టీలో చేరాల్సి ఉన్నదని, కానీ ఇరు రాష్ట్రాల ముఖ్య మంత్రుల మీటింగ్ నేపథ్యంలో వాయిదా పడిందనే చర్చ కూడా గాంధీభవన్ లో జరుగుతుంది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ప్రతిపక్షాల డ్రామాలుప్రతిపక్షాలు కావాలనే కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ డ్రామాలు చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేవని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గంలోని కేశవపట్నం మండలం, తాడికల్ గ్రామంలో గల…
- నష్టాల్లో కంగువా నిర్మాత … అండగా హీరో సూర్యదర్శకుడు శివ తెరకెక్కించిన ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా, తమిళ స్టార్ సూర్య హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కంగువా. ఇది ఒక పీరియాడికల్ డ్రామా కాన్సెప్ట్ తో సరికొత్త కథతో వచ్చిన ఈ సినిమా…
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ ల మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారా.. లేదా.. అన్న అంశం అందరిని ఆలోచింపచేస్తుంది. ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఆయన ఇంటి వద్ద ఆర్జీవీ కోసం…
- మంత్రి వస్తేనే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంత్రి వస్తేనే పంపిణీ చేస్తామని అధికారులు చెబుతూ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేయడం ఆనవాయితీ కానీ మంత్రి…
- నిందితులతో కలిసి పోలీసుల చేతివాటంపోలీసులే నిందితులతో చేతులు కలిపి వారి వద్ద భారీ ఎత్తున డబ్బులు తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం, వేల్పూరు గ్రామంలో రెండు గేదెలను అపహరించిన కేసులో తణుకు రూరల్ పోలీసులు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి