కేంద్ర పర్యావరణ నిబంధనలు ఉల్లగించి పరిమితికి మించి తవ్వకాలు జరపడంతో పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి (Mahipal reddy) సోదరుడు మధుసూధన్ రెడ్డి (Madhusudhan reddy)ని పోలీసులు అరెస్ట్ చేశారు. తెల్లవారుజామున పటాన్ చెరులోని ఆయన నివాసానికి వచ్చిన పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రభుత్వ భూమిలో అక్రమ మైనింగ్ కేసులో మధుసూధన్ ను అరెస్టు చేసినట్లు చెప్పారు. అనుమతుల గడువు అయిపోయినా మైనింగ్ చేశారని ఆరోపిస్తూ. ఇటీవల క్వారీని అధికారులు సీజ్ చేశారు. అనంతరం చర్యలు తీసుకోవాలని పటాన్ చెరు పోలీసులకు తహశీల్దార్ ఫిర్యాదు చేశారు. అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. మధుసూదన్ ను అరెస్ట్ చేయడంతో పోలీస్ స్టేషన్ కు బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, మహనీయులకు నివాళులు
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి