మేడిగడ్డ వైఫల్యానికి నిర్మాణ సంస్థే కారణమని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్పష్టం చేసింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project)లో అంతర్భాగంగా మేడిగడ్డ బ్యారేజీని నిర్మించారు. 2023 అక్టోబర్ మాసంలో మేడిగడ్డ బ్యారేజీకి చెందిన పిల్లర్లు కుంగిపోయాయి. అదే సమయంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సాగుతోంది. దీంతో… ఈ అంశంపై బీఆర్ఎస్ పై విపక్షాలు విమర్శలు గుప్పించాయి.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం పరిశీలించాలని కోరింది. ఈ బ్యారేజీపై రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ జస్టిస్ ఘోష్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఘోష్ కమిటీ ఈ విషయంపై న్యాయ విచారణ చేపడుతోంది.
2019 వరదల సమయంలోనే బ్యారేజీ దెబ్బతిన్నదని, ఆ సమయంలో బ్యారేజీ డిఫెక్ట్ లయబిలిటీ కాలంలో ఉన్నందున పునరుద్ధరణ బాధ్యత నిర్మాణ సంస్థే తీసుకోవాల్సి ఉంటుందని డ్యామ్ సేఫ్టీ అథారిటీ పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మెన్ జె.చంద్రశేఖర్ నేతృత్వంలో కమిటీ నివేదిక ఇచ్చింది.
డిజైన్ల ప్రకారం బ్యారేజీల నిర్మాణం జరగలేదని NDSA తేల్చిచెప్పింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను కూడా మేడిగడ్డ డిజైన్లతో నిర్మించడం వల్ల వాటిలోనూ వైఫల్యాలున్నాయని, ఆయా బ్యారేజీల్లో సీపేజీల నివారణకు ప్రత్యేక కాంక్రీట్‌తో ట్రీట్మెంట్ చేయాలని సూచించింది. వర్షాకాలంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల గేట్లన్నీ తెరిచే ఉంచాలని కమిటీ సూచించింది.వరద పూర్తిస్థాయిలో తగ్గుముఖం పట్టిన తర్వాత మేడిగడ్డలో షీట్‌పైల్ కాఫర్ డ్యామ్ నిర్మాణం చేపట్టాలని పేర్కొంది. కాఫర్ డ్యామ్ నిర్మించిన తర్వాత మేడిగడ్డలోని బ్లాక్-7ను పూర్తిగా తొలగించి, ఆ స్థానంలో కొత్త బ్లాకు కట్టాలని సూచించింది. ఏడో బ్లాకులో దెబ్బతిన్న గేట్ల సీల్‌లను తొలగించి గేట్లను మాన్యువల్ విధానంలో ఎత్తాలని సూచించింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, నిర్వహణపైనా కమిటీ పలు అంశాలను ప్రస్తావించింది. 2019 నవంబర్ లో వరదల తర్వాత గేట్లు మూయగానే ఈ బ్యారేజీల్లో లోపాలు వెలుగు చూసినట్టుగా ఈ నివేదిక తెలిపింది. కాఫర్ డ్యామ్, షీట్ ఫైల్స్ శిథిలాలు యథాతథంగా ఉన్నాయని కమిటీ పేర్కొంది. డిజైన్ల ప్రకారంగా నిర్మాణం జరగలేదని తేల్చి చెప్పింది. మేడిగడ్డ బ్యారేజీ నిర్మించిన నిర్మాణ సంస్థే వైఫల్యానికి కారణంగా కమిటీ నివేదిక పేర్కొంది.
కేసీఆర్ సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై అప్పట్లో విస్తృతంగా ప్రచారం చేసుకుంది. అయితే అదే ప్రాజెక్టు అంశం బీఆర్ఎస్ కు రాజకీయంగా ఇబ్బందిగా మారింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అవతకవలపై కాంగ్రెస్ సర్కార్ ఫోకస్ పెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై విజిలెన్స్ విచారణకు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయమై ప్రాథమిక నివేదికను కూడా ప్రభుత్వానికి అందింది. విచారణ సంస్థలు ఇచ్చే నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తుంది. దర్యాప్తు సంస్థలు ఇచ్చే నివేదికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ప్రతిపక్షాల డ్రామాలుప్రతిపక్షాలు కావాలనే కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ డ్రామాలు చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేవని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గంలోని కేశవపట్నం మండలం, తాడికల్ గ్రామంలో గల…
- నష్టాల్లో కంగువా నిర్మాత … అండగా హీరో సూర్యదర్శకుడు శివ తెరకెక్కించిన ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా, తమిళ స్టార్ సూర్య హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కంగువా. ఇది ఒక పీరియాడికల్ డ్రామా కాన్సెప్ట్ తో సరికొత్త కథతో వచ్చిన ఈ సినిమా…
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ ల మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారా.. లేదా.. అన్న అంశం అందరిని ఆలోచింపచేస్తుంది. ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఆయన ఇంటి వద్ద ఆర్జీవీ కోసం…