హైదరాబాద్ సీపీగా కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత శ్రీనివాస్‌రెడ్డికి ప్రాధాన్యత గల పోస్టింగ్ మొదటి సారి వచ్చింది. గతంలో గ్రే హౌండ్స్ , అక్టోఫస్‌లో ఆయన పనిచేశారు. నూతన సీపీ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డికి ముక్కుసూటి అధికారి అన్న పేరుంది. కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీపీ శ్రీనివాస్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ మహా నగరం లో డ్రగ్స్, జూదం నిర్మూలిస్తామన్నారు. ప్రజలు, ప్రభుత్వానికి వారధిగా మీడియా ఉంటోందని కితాబునిచ్చారు. ప్రజాభిప్రాయాన్ని మీడియా ద్వారా తెలియజేయాలని కోరుతున్నానని తెలిపారు. మెట్రో పాలిటీన్ సిటిలో మూడు అంశాలపై అప్రమత్తంగా ఉండాలని సీపీ కోరారు. తెలంగాణా స్టేట్‌తో పాటు హైదరాబాద్‌ను డ్రగ్ ఫ్రీ సిటీగా తీర్చి దిద్దాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లు సీపీ వివరించారు. హైదరాబాద్, తెలంగాణాను డ్రగ్స్ ముఠాలు వదిలి వెళ్లాలని లేకపోతే ఉక్కుపాదం మోపుతామని డ్రగ్స్ ముఠాలను ఆయన హెచ్చరించారు. సినీ ఇండస్ట్రీలో కూడా డ్రగ్స్ సేవిస్తున్నట్లు గుర్తించామన్నారు.
Read Also..
Read Also..