విద్యుత్ అధికారులతో సీఎం సమీక్ష సమావేశం :
విద్యుత్ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహంచారు. ఈ సమావేశంలో విద్యుత్ అధికారులపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. కరెంట్ కొరత లేకున్నా సరఫరాను ఎందుకు తీసేస్తున్నారని ప్రశ్నించారు. ఇక మీదట కరెంట్ సరఫరా ఆపితే సస్పెండ్ చేస్తామని సీఎం హెచ్చరించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే అధికారుల కుట్రలను సహించేది లేదని మందలించారు.
ఆలూరు విద్యుత్ సబ్ స్టేషన్ లో దారుణ హత్య..
రాష్ట్రంలో ఎక్కడైనా అకారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కల్పిస్తే బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడున్న అవసరాలకు సరిపడినంత విద్యుత్తును ప్రభుత్వం సరఫరా చేస్తోందని అన్నారు. ప్రభుత్వం తరఫున ఎక్కడ విద్యుత్తు కోతలను విధించటం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గతంతో పోలిస్తే రాష్ట్రంలో కరెంట్ సరఫరా పెరిగిందని సీఎం రేవంత్ తెలిపారు. ఇటీవల పలు చోట్ల విద్యుత్తు సరఫరా నిలిపేసిన సంఘటనలపై ముఖ్యమంత్రి ఆ శాఖ అధికారులను హెచ్చరించారు. కొందరు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.