74
నరసాపురం పట్టణంలోని శ్రీ ఆదికేశవ ఎంబరమన్నారు వారి దేవస్థానం లో అర్చకత్వం చేసే ఒక అర్చకుడు విధులకు ఆలస్యం రావటంతో దేవస్థానం చైర్మన్ నువ్వు పూజలు చేయకు అని నోటీసులు ఇచ్చి బయటకు పంపేయడంతో ఆగ్రహించిన పూజారులు ఆలయ ప్రధాన ద్వారాలకు తాళాలు వేసి దేవాలయం బయట బైఠాయించి వేదమంత్రాలతో ధర్నా నిర్వహించారు. ఇంత జరుగుతున్నా ఆలయ ఈవో చాగంటి సురేష్ సంఘటన స్థలానికి రాకపోగా గొడవ ఏమి లేదని సెటిల్ అయిపోతుందని చెప్పటం గమనాహారం చివరకు పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని చైర్మన్ మరియు పూజరులతో మాట్లాడటం తో ఆందోళనను విరమించారు.