మహారాష్ట్ర సీఎంకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ..

మహారాష్ట్ర సీఎంకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ

Advertisements

<p>మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు&period; తుమ్మిడిహట్టి బ్యారేజీ అంశంపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆ లేఖలో పేర్కొన్నారు&period; చర్చల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులకు సమయం ఇవ్వాలని&comma; సమావేశానికి తేదీని ఖరారు చేయాలని విజ్ఞప్తి చేశారు&period; తుమ్మిడిహట్టి ప్రాజెక్టుకు 148 మీటర్ల ఎఫ్ఆర్ఎల్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం గతంలో అంగీకరించిందని గుర్తు చేశారు&period; కానీ దీంతో ఉత్తర తెలంగాణ నీటి అవసరాలు తీరవని పేర్కొన్నారు&period; ఎఫ్ఆర్ఎల్ పెరిగితేనే గ్రావిటీ ద్వారా తెలంగాణకు నీళ్లు వస్తాయని తెలిపారు&period; మహారాష్ట్రలో ముంపు ప్రభావం తక్కువగానే ఉంటుందని పేర్కొన్నారు&period; కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ గా భేటీ అయ్యారు&period; అమెండెడ్ భారత్ నెట్ ప్రోగ్రాం కింద తెలంగాణలో టీ-ఫైబర్ ప్రాజెక్టు అమలుపై చర్చించారు&period; వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి పలు కీలక అంశాలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకువెళ్ళారు&period; ప్రతి గ్రామానికి&comma; ప్రతి ఇంటికి బలమైన హైస్పీడ్ ఇంటర్నెట్ అందించాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చ జరిగింది&period; అమెండెడ్ భారత్ నెట్ ప్రోగ్రాం అమలుకు సంబంధిత ఒప్పందాన్ని త్వరితగతిన కుదుర్చుకోవడం&comma; పెండింగ్‌లో ఉన్న నిధుల విడుదల వేగవంతం తదితర అంశాలపై చర్చించారు&period; మండలం నుంచి గ్రామ పంచాయతీ రింగ్ నెట్ వర్క్ ఆస్తులను డిజిటల్ భారత్ నిధికి బదిలీ చేసేందుకు స్పష్టమైన విధానం ఏర్పాటు చేయడంపై వారు చర్చించారు&period; తెలంగాణ విజ్ఞప్తులపై సింధియా సానుకూలంగా స్పందించారు&period; కేంద్రం సహకరిస్తుందని హామీ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..