వర్షం వస్తేనే జంకుతున్న భద్రాద్రి గిరిజన గ్రామాలు.

వర్షం వస్తేనే జంకుతున్న భద్రాద్రి గిరిజన గ్రామాలు

Advertisements

<p>ఆకాశం నల్లటి మబ్బులు కమ్ముకుంటుంటే అన్నదాత ఆనందంతో మురిసిపోతాడు&period; కానీ&&num;8230&semi; భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారాంపురం పంచాయతీ పరిధిలోని అన్నారం&comma; చింతలపాడుతో పాటు మరో మూడు గిరిజన గ్రామాల ప్రజల గుండెల్లో మాత్రం వణుకు మొదలవుతుంది&period; వారికి వర్షం అంటే పరవశం కాదు&&num;8230&semi; బాహ్య ప్రపంచంతో బంధాలు తెగిపోయే ఒక భయంకరమైన దిగ్బంధనం&period;<&sol;p>&NewLine;<p>గతేడాది జూన్ నెలలో ఊరంతా పండగ వాతావరణం నెలకొంది&period; మంత్రులు&comma; ఎమ్మెల్యేలు&comma; అధికారుల కాన్వాయ్‌à°² సైరన్లతో ఆ మారుమూల ఏజెన్సీ ప్రాంతం మారుమోగిపోయింది&period; మూడు వంతెనల నిర్మాణానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి&comma; అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చేతుల మీదుగా వైభవంగా శంకుస్థాపన జరిగింది&period; శిలాఫలకంపై మంత్రుల పేర్లు మెరిశాయి&period; ఆ శిలాఫలకాన్ని చూసి గిరిజన బిడ్డలు మురిసిపోయారు&period; ఇక మన కష్టాలు తీరుతాయని&&num;8230&semi; వర్షం వచ్చినా పిల్లలు బడికి వెళ్తారని&period;&period; ఊరిలోకి అంబులెన్స్ వస్తుందని సంబరపడ్డారు&period;<&sol;p>&NewLine;<p>శంకుస్థాపన జరిగి సరిగ్గా ఏడాది గడిచింది&period; కానీ అక్కడ మాత్రం తట్టెడు మట్టి కూడా తీయలేదు&period; రంగులద్దిన ఆ శిలాఫలకాలు నేడు ఎండకు ఎండి&comma; వానకు నానుతూ శిథిలావస్థకు చేరుకుంటున్నాయే తప్ప&comma; వంతెనల నిర్మాణ అడుగులు మాత్రం ముందుకు పడలేదు&period; లాభాలు రావనో&&num;8230&semi; మరే ఇతర సాంకేతిక కారణాల వల్లో సదరు కాంట్రాక్టర్ ఈ పనులను తాను చేయలేను బాబోయ్ అంటూ చేతులెత్తేసి&period;&period; అధికారులకు దరఖాస్తు పెట్టుకున్నట్లు తెలుస్తోంది&period; కాంట్రాక్టర్ల లాభనష్టాల బేరీజులో ఇక్కడి గిరిజనుల ప్రాణాలు బలి అవుతున్నాయి&period;<br &sol;>&NewLine;మళ్లీ వర్షాకాలం వచ్చేసింది&period; వాగులు పొంగిపొర్లితే ఈ ఐదు గ్రామాల పరిస్థితి వర్ణనాతీతం&period; వాగు అవతలి ఒడ్డున ఉన్న పాఠశాలలకు వెళ్లలేక విద్యార్థులు ఇళ్లకే పరిమితం కావాలి&period; చదువుకోవాలన్న వారి ఆశలు వాగు నీటిలో కొట్టుకుపోవాల్సిందే&period; గర్భిణీలకు నొప్పులు వచ్చినా&comma; ముసలివారికి ప్రాణాంతక పరిస్థితి ఎదురైనా ఊరిలోకి అంబులెన్స్‌ వాహనం రాలేదు&period; వాగు దాటించలేక&comma; సకాలంలో వైద్యం అందక ప్రాణాలు గాల్లో కలవాల్సిందేనా అని గిరిజనులు కన్నీరుమున్నీరవుతున్నారు&period;<&sol;p>&NewLine;<p>ప్రభుత్వాలు మారుతున్నాయి&&num;8230&semi; పాలకులు మారుతున్నారు&period; కానీ తమ బతుకులు&comma; తమ కష్టాలు మాత్రం ఎక్కడివక్కడే ఉన్నాయంటూ స్థానిక గిరిజన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period; ఓట్ల కోసం వచ్చే నాయకులు&comma; గెలిచాక కన్నెత్తి చూడకపోవడంపై వారిలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది&period; ఇకనైనా ఉన్నతాధికారులు&comma; ప్రజాప్రతినిధులు స్పందించాలని కోరుతున్నారు&period; కాంట్రాక్టర్ల సమస్యలను పరిష్కరించి&&num;8230&semi; తక్షణమే ఈ మూడు హైలెవెల్ వంతెనల పనులను ప్రారంభించాలని విజ్ఞప్తి చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.