రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే.

రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలను

Advertisements

<p>రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలను ముందుగానే అంచనా వేసి&comma; రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా శాస్త్రీయ ప్రణాళికతో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు&period; పటాన్‌చెరులోని ఇక్రిశాట్ లో రాష్ట్రస్థాయి వ్యవసాయ&comma; ఉద్యాన&comma; పశుసంవర్ధక&comma; నీటిపారుదల&comma; భూగర్భ జలాలు&comma; విద్యుత్&comma; వాతావరణ తదితర అనుబంధ శాఖల ఉన్నతాధికారులతో &&num;8220&semi;రాష్ట్రంలో ఎల్‌నినో నేపథ్యంలో కంటింజెన్సీ ప్లానింగ్&&num;8221&semi; పై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు&period;<&sol;p>&NewLine;<p>సమావేశంలో రాష్ట్రంలోని ప్రస్తుత వర్షపాత పరిస్థితులు&comma; ఎల్‌నినో ప్రభావం&comma; వర్షాలు ఆలస్యం అయ్యే అవకాశాలు&comma; అధిక ఉష్ణోగ్రతల ప్రభావం&comma; భూగర్భ జలాల లభ్యత&comma; ఖరీఫ్ పంటలపై ప్రభావం&comma; రైతులకు అందించాల్సిన సాంకేతిక సూచనలు&comma; ప్రత్యామ్నాయ పంటల సాగు&comma; నీటి సంరక్షణ చర్యలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు&period;ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ&period;&period; జూలై 15&comma; జూలై 30&comma; ఆగస్టు 15 తేదీలను ప్రామాణికంగా తీసుకుని మూడు దశల్లో కంటింజెన్సీ ప్రణాళికను అమలు చేయాలని సూచించారు&period;<&sol;p>&NewLine;<p>వర్షపాత పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తూ ప్రతి జిల్లాకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధంగా ఉండాలని ఆదేశించారు&period;ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని రైతులకు ముందస్తుగా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని&comma; వాతావరణ మార్పులు వ్యవసాయ రంగానికి సవాలుగా మారిన నేపథ్యంలో శాస్త్రీయ వ్యవసాయ విధానాలను అనుసరించాలని తెలిపారు&period; వర్షాలు ఆలస్యమైనా లేదా తక్కువగా కురిసినా రైతులు ఇబ్బందులు పడకుండా వరికి బదులుగా పప్పుధాన్యాలు&comma; చిరుధాన్యాలు&comma; నూనెగింజలు&comma; వేరుశనగ&comma; పెసలు&comma; మినుములు&comma; కందులు&comma; సజ్జలు&comma; జొన్నలు వంటి తక్కువ నీటి అవసరమయ్యే ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మహానగర ప్రజా రవాణాపై HMDA ఫోకస్.

మా మధ్య ఎలాంటి గొడవలు జరగలేదు.. మేమంతా కలిసే ఉంటాం.

పట్టభద్రులైన పది మంది విద్యార్థుల్ని, బంగారు పతకం సాధించిన దీపికను అభినందించిన విశాల్.