ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి..

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి..

Advertisements

<p>పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి&comma; తన సొంత జీతంతో పేద విద్యార్థులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ అందించి మరోసారి సేవాభావాన్ని చాటుకున్నారు&period; తొర్రూరు పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో హనుమండ్ల ఝాన్సీ రెడ్డి సహకారంతో గత 45 రోజులుగా నిర్వహించిన కంప్యూటర్ శిక్షణా కార్యక్రమం విజయవంతంగా పూర్తికాగా&comma; శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు&period;<&sol;p>&NewLine;<p>ఉద్యోగాలు&comma; ఉన్నత విద్యలో కంప్యూటర్ పరిజ్ఞానం ఎంతో అవసరమనే ఉద్దేశంతో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తన నెలవారీ జీతంలో నుంచి నిధులు వెచ్చించి ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు&period; ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఎలాంటి భారం లేకుండా నాణ్యమైన శిక్షణ అందించడం అభినందనీయమని పలువురు కొనియాడారు&period;<&sol;p>&NewLine;<p>ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ&comma; ఉచితంగా కంప్యూటర్ శిక్షణతో పాటు సర్టిఫికెట్ పొందడం తమ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు&period; తల్లిదండ్రులు కూడా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి చేసిన సేవను ప్రశంసిస్తూ&comma; పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం స్ఫూర్తిదాయకమని&comma; ఇచ్చిన హామీని నిలబెట్టుకుని ఆచరణలో చూపించడం గొప్ప విషయమని హర్షం వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మహానగర ప్రజా రవాణాపై HMDA ఫోకస్.

మా మధ్య ఎలాంటి గొడవలు జరగలేదు.. మేమంతా కలిసే ఉంటాం.

పట్టభద్రులైన పది మంది విద్యార్థుల్ని, బంగారు పతకం సాధించిన దీపికను అభినందించిన విశాల్.