హైదరాబాద్ హైటెక్ సిటీలో కార్ రేసర్ల బీభత్సం..

హైదరాబాద్ హైటెక్ సిటీలో కార్ రేసర్ల బీభత్సం

Advertisements

<p>వీకెండ్‌ వచ్చిందంటే చాలు యువత రెచ్చిపోతున్నారు&period; హైదరాబాద్‌లో రేసులతో హంగామా సృష్టిస్తున్నారు&period; తాజాగా రాత్రి రాయదుర్గం పరిధిలో కార్లు&comma; బైకులతో రేసింగ్ చేశారు&period; వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నించిన పోలీసులపైకే దూసుకొచ్చారు&period; దీంతో పోకిరీలను అదుపులోకి తీసుకుని కారును స్టేషన్ కు తరలించారు&period; మరికొందరు యువకులు పరారవగా&period;&period;పట్టుబడిన యువకులపై కేసులు నమోదు చేశారు&period; గ‌తంలోనూ అనేక‌సార్లు హైటెక్ సిటీలో యువ‌కులు కార్లు&comma; బైక్ రేసింగ్‌కు పాల్పడుతూ పోలీసులకు పట్టుబడ్డారు&period; పలుమార్లు హెచ్చరించినా వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చినా యువకుల తీరులో మార్పు మాత్రం రావడంలేదు&period; ముఖ్యంగా వీకెండ్స్‌లో యువ‌కులు రేసింగ్‌లతో రెచ్చిపోతున్నారు&period; ఈ రేసింగ్‌లో పాల్గొనేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు à°µ‌చ్చేస్తున్నారు&period; ఈ రేసింగ్‌లతో వాహ‌à°¨‌దారులు&comma; ప్రజ‌లు à°­‌à°¯‌à°ª‌డిపోతున్నారు&period;<&sol;p>&NewLine;<p>నగర శివారులోని సాఫ్ట్‌వేర్‌ ఐటీ హబ్‌ ప్రాంతాలు వేదికగా యువకులు హల్‌చల్‌ చేస్తున్నారు&period; నిబంధనలకు విరుద్ధంగా కార్లు&comma; బైక్‌లతో బీభత్సం సృష్టిస్తూ స్థానికులు&comma; వాహనదారులను భయాందోళనకు గురి చేస్తున్నారు&period; అర్ధరాత్రి నాలెడ్జి సిటీ ప్రాంతంలో కొందరు యువకులు భారీ శబ్దాలు వచ్చేలా ఏర్పాటు చేసుకున్న సైలెన్సర్లతో కార్లు&comma; బైకులను వేగంగా నడుపుతూ హల్‌చల్ చేశారు&period; టీ-హబ్&comma; ఐకియా ప్రాంతాల్లో రోడ్లపై రేసింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు&period; ఈ క్రమంలో అటుగా వస్తున్న హోండా సిటీ కారును పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు&period; అయితే&comma; కారు డ్రైవర్ ఆపకుండా పోలీసులపైకి దూసుకెళ్లాడు&period; అడ్డుకోవడానికి ప్రయత్నించిన కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి&period; ఘటనపై కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు&period;&period; ర్యాష్ డ్రైవింగ్‌కు పాల్పడిన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు&period; హోండా సిటీ కారుతో పాటు సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు&period; పోలీసుల రాకను గమనించిన మిగిలిన రేసర్లు ఘటనా స్థలం నుంచి పరారయ్యారు&period; నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..