దండు మైలారంలో గ్రామకంఠం భూమి పరిరక్షణకు రిలే దీక్షలు.

Advertisements

<p>రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దండు మైలారం గ్రామంలో గ్రామకంఠం భూమి పరిరక్షణ కోసం గ్రామస్తుల ఆందోళన ఉధృతమైంది&period; అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు వివిధ రాజకీయ&comma; ప్రజా సంఘాల మద్దతు లభిస్తోంది&period; ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు&period; గ్రామకంఠం భూమితో పాటు బతుకమ్మ కుంట కూడా ఆక్రమణకు గురైందని&comma; దీంతో గ్రామ సంప్రదాయాలు దెబ్బతింటున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు&period; అంత్యక్రియల నిర్వహణకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు&period; ప్రతి పేద కుటుంబానికి 120 గజాల ఇంటి స్థలం కేటాయించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలకు అవసరమైన స్థలాన్ని గ్రామకంఠం భూమిలోనే కేటాయించాలని గ్రామ పెద్దలు డిమాండ్ చేశారు&period; ఆక్రమణలను తొలగించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.